calender_icon.png 5 September, 2025 | 6:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తృణమూల్ ఎంపీ మహువాపై కేసు

01-09-2025 01:48:30 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 31: కేంద్రహోం మంత్రి అమిత్‌షాను ఉద్దేశిస్తూ తృణమూల్ కాంగ్రె స్ ఎంపీ మహువా మొయిత్రా తీవ్ర వ్యాఖ్య లు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో మహువామొయిత్రాపై ఛత్తీస్‌గడ్‌లోని రాయ్‌పూర్ లో కేసు నమోదైంది.

ఓ వ్యక్తి మహువా వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చే సినట్టు పోలీసులు పేర్కొన్నారు. సరిహద్దు భద్రత గురించి మహువా హోం మంత్రిని దూషిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహువా వ్యాఖ్యలు ఒక వర్గాన్ని భయబ్రాంతులకు గురి చేశేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. మహువాపై పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ కొత్వాలీ పోలీస్ స్టేషన్‌లో కూడా కేసు నమోదైంది.