calender_icon.png 13 May, 2025 | 12:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భగత్‌సింగ్ స్పూర్తితో మతోన్మాదంపై పోరాడాలి

24-03-2025 01:29:37 AM

డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు రవినాయక్

వేములపల్లి, మార్చి 23 : భగత్ సింగ్ స్పూర్తితో యువత మతోన్మాదంపై పోరాడాలని డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు రవినాయక్ అన్నారు. భగత్సింగ్ 94వ వర్థంతి సందర్భంగా వేములపల్లి మండల కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ మండల కమిటీ సభ్యులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా  ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్తో కలిసి శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులు, విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల పెండింగ్ మెస్చార్జీలు, ఫీజు రీయింబర్స్మెంట్ను విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం యూత్ డిక్లరేషన్ అమలు చేసి, జాబ్ క్యాలెండర్ ప్రకటించి బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలన్నారు.

కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ పాదూర్ గోవర్ధన, మాజీ ఎంపీటీసీ చల్లబట్ల చైతన్య, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు పతాని శ్రీను, జిల్లా కమిటీ సభ్యులు చల్లబట్ల ప్రణీత్ రెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ కార్యదర్శి సైదా నాయక్, మండల కార్యదర్శి పుట్ట సంపత్ పాల్గొన్నారు.      

భగత్‌సింగ్‌కు ఘన నివాళి 

మునుగోడు,మార్చి 23 : భగత్సింగ్ వర్ధంతి సందర్భంగా మునుగోడులో ఆయన చిత్రపటానికి ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తీరుపారి వెంకటేశ్వర్లు ఆ సంఘం నాయకలతో కలిసి పూలమాల లేసి నివాళులర్పించారు.  ఏఐవైఎఫ్ మండల అధ్యక్ష కార్యదర్శులు ఉప్పర బోయిన సతీశ్ ,బండారు శంకర్, మండల కార్యదర్శి చాపల శ్రీను తదితరులు పాల్గొన్నారు.