09-09-2025 12:30:52 AM
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు
తుంగతుర్తి, సెప్టెంబర్ 8 : గోదావరి జనాలను రైతులు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి లోకి రావాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మధుర సామేలు అన్నారు. సోమవారం కొడకండ్ల మండలం బయ్యన వాగు రిజర్యాయర్ స్టేజ్ 2 దగ్గర ఎస్సారెస్పీ కాలువల ధ్వారా గోదావరి సాగు నీటి విడుదల కార్యక్రమానికి నీటి పారుదలశాఖ అధికారులతో కలసి ముఖ్యఅతిథిగా విచ్చేసి నీటిని విడుదల చేసిన తుంగతుర్తి శాసనసభ్యులుమందుల సామేలు.
ఈసందర్బంగా మాట్లాడుతు తుంగతుర్తి నియోజకవర్గంలో 94 వేల ఎకరాలకు నీళ్లు అందుతాయాన్ని తెలియజేశారు. రైతులు గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు .మండలాల్లోని గ్రామాల్లోని కుంటలు ,చెరువులు నిండే విధంగా అధికారులకు కృషి చేయాలని కోరారు.
కాలువలకు గండ్లు పెడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు ఈ ఈ సత్యనారాయణ డి ఈ నవీన్ కుమార్ తుంగతుర్తి మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్ సోజ్ నరేష్, సుంకరి జనార్ధన్ కందుకూరు లక్ష్మయ్య కొండరాజు నాగరాజు తదితర, నాయకులు పాల్గొన్నారు.