calender_icon.png 27 July, 2025 | 11:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి పరిరక్షణకు ఉద్యమించాలి

27-07-2025 07:49:49 PM

బీఎంఎస్ అధ్యక్షుడు సత్తయ్య..

మంచిర్యాల (విజయక్రాంతి): సింగరేణి(Singareni) పరిశ్రమ పరిరక్షణ, కార్మికుల హక్కుల సంరక్షణ కోసం అందరు ఉద్యమించాలని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (బిఎంఎస్) అధ్యక్షులు యాదగిరి సత్తయ్య కోరారు. ఆదివారం ఆర్కే 5 గనిపై వాల్ పోస్టర్ ఆవిష్కరించిన అనంతరం ప్రధాన కార్యదర్శి యతిపతి సారంగపాణితో కలిసి మాట్లాడారు. సెప్టెంబర్ 17 వరకు నిర్వహించే దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమాలను సింగరేణి కార్మికులు జయప్రదం చేయాలని, భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సింగరేణి పరిశ్రమ పరిరక్షణ, కార్మిక హక్కుల సంరక్షణ అనే లక్ష్యంతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. యాజమాన్యం నూతన బొగ్గు గనులు ప్రారంభించి కొత్త ఉద్యోగుల నియామకం చేపట్టాలని డిమాండ్ చేశారు. బొగ్గు పరిశ్రమలలో 100 శాతం భద్రత నియమాలను పాటించాలని, విచక్షణ రహిత ఉత్పత్తి లక్ష్యాలు, అనురక్షిత మైనింగ్ వల్ల కలిగే కాలుష్యాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. 

ఈపీఎఫ్ తరహాలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రూ. 15 వేల పెన్షన్ పథకంలో 1.16 శాతం సహకారాన్ని జమ చేయాలని కోరారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు రూ.1000 కనీస పెన్షన్ వంద శాతం అందేలా చూడాలని, ఒప్పందం జరిగిన తేదీ నుంచి వీలైనంత త్వరగా బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. బీఎంఎస్ ఏరియా ఉపాధ్యక్షులు నాతాడి శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సెంట్రల్ సెక్రెటరీ మాదాసు రవీందర్, సెంట్రల్ ట్రెజరర్ ఆకుల హరి, శ్రీరాంపూర్ ఏరియా కార్యదర్శి రాగం రాజేందర్, ట్రెజరర్ గూడ శ్రీకాంత్, జాయింట్ సెక్రెటరీ మేకల స్వామి, కట్కూరి సతీష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ గోళ్ళ మహేందర్, ఆర్కే 5 ఫిట్ సెక్రెటరీ రామకృష్ణ, అసిస్టెంట్ ఫిట్ సెక్రెటరీ చంద్రశేఖర్, టి కిరణ్ కుమార్, కుంట రాజు, పాగిడి శ్రీకాంత్, చల్ల ప్రశాంత్, బుర్ర అరుణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.