calender_icon.png 13 September, 2025 | 3:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి

13-09-2025 12:41:17 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

సూర్యాపేట, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి) : ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు అధ్యాపకులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్నందలాల్ పవార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, మోడల్ స్కూల్స్, వెల్ఫేర్ కళాశాలలు,కేజీబివి లకు సంబంధించిన ప్రిన్సిపాల్స్ తో ఇంటర్మీడియట్ మొదటి, రెండు సంవత్సరాల అకాడమీక్ సంబంధించి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ  కళాశాలల మీద నమ్మకంతో  విద్యార్థులు వస్తున్నారని వారికి అర్థమయ్యేలా బోధించి ప్రతి సబ్జెక్టులో 70 శాతం7 పైగా మార్కులు సాధించేలా చూడాలన్నారు. ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ విద్యార్థుల హాజరు శాతం చాలా తక్కువగా ఉంటుందని ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి ప్రతిరోజు కళాశాలకు వచ్చేలా చూడాలని తల్లిదండ్రులకు సూచించాలన్నారు.

ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలకమైనందున మోటివేషన్ క్లాసులు నిర్వహించడంతోపాటు ఖాన్ అకాడమి, ఫిజిక్స్ వాలా లాంటి వాటిని  విద్యార్థులు ఉపయోగించి  పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యేలా చూడాలన్నారు. ప్రతి సోమవారం, మంగళవారం స్టాఫ్ అటెండెన్స్ 100% హాజరవ్వాలని అత్యవసరం ఉంటే తప్ప సెలవు మంజూరు చేయకూడదని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్ విద్యా అధికారి భాను నాయక్, జి సీ డి ఓ పూలన్, డి సీ ఓ లు పద్మ, లక్ష్మి, ప్రిన్సిపాల్స్, తదితరులు పాల్గొన్నారు.