13-09-2025 12:38:30 AM
సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి
నకిరేకల్ సెప్టెంబర్ 12(విజయక్రాంతి): భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ మేధావి సీతారాం ఏచూరి ఆశయ సాధన కోసం కృషి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి కొనియాడారు. శుక్రవారం పట్టణంలోని గుడిపాటి ఫంక్షన్ హాల్ లో సిపిఎం పూర్వ జాతీయ కార్యదర్శి ఏచూరి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడమే ఏ చూరికి మనమిచ్చే ఘన నివాళి అని పేర్కొన్నారు.
అమరవీరుల స్థూపం వద్ద నివాళులు
తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు భాగంగా సిపిఎం ఆధ్వర్యంలో నకిరేకల్ పట్టణంలోని నర రాఘవరెడ్డి భవనం నుండి కల్లు రామచంద్రారెడ్డి స్థూపం వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి స్థూపానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ చిన్న వెంకులు, జిట్టా నగేష్, జిట్టా సరోజ, మల్లమ్మ, మహేష్, గంజి మురళి, నకిరేకల్, కట్టంగూర్, శాలిగౌరారం, చిట్యాల, కేతపల్లి, నార్కట్ పల్లి మండలాల కార్యదర్శులు రాచకొండ వెంకట్ గౌడ్, పింజర్ల సైదులు, చలకాని మల్లయ్య, అవిశెట్టి శంకరయ్య, లూర్డు మారయ్య, చింతపల్లి బయన్న, నకిరేకల్ టౌన్ కార్యదర్శి ఒంటిపాక వెంకటేశ్వర్లు, చిట్యాల టౌన్ కార్యదర్శి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని నష్టం
వలిగొండ,సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ రాజ్యసభ సభ్యులు సీతారాం ఏచూరి గొప్ప మార్క్సిస్టు మహా మేధావని ఆయన మరణం భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని నష్టమని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి అన్నారు. శుక్రవారం సిపిఎం వలిగొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో సీతారాం ఏచూరి గారి ప్రథమ వర్ధంతి గర్దాసు నరసింహ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కందడి సత్తిరెడ్డి, కొండే కిష్టయ్య, దుబ్బ లింగం పాల్గొన్నారు.
ఏచూరి ఆశయాలు సాధిస్తాం
హుజూర్ నగర్, సెప్టెంబర్ 12: సీపీఎం మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆశయాలను సాధిస్తామని సీపీఎం మండల కార్యదర్శి పోసనబోయిన హుస్సేన్ అన్నారు. శుక్రవారం ఏచూరి సీతారాం ప్రధమ వర్ధంతి సందర్భంగా మండలంలోని శ్రీనివాసపురం గ్రామంలో పార్టీ శ్రేణులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మండల కమిటీ సభ్యులు తంగెళ్ళ వెంకటచంద్ర, షేక్ ఖాసీం, షేక్ సైదా, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు తంగెళ్ళ గోపరాజు, శాఖ సభ్యులు వీరస్వామి, శ్రీను, వీరబాబు, నూకల అంజయ్య, భూక్య సైదమ్మ, తదితరులు,పాల్గొన్నారు.