calender_icon.png 5 November, 2025 | 12:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

03-11-2025 01:21:06 AM

వెంకటాపురం(నూగూరు), నవంబర్  2 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దారి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు గంపా రాంబాబు తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ సమీపంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్‌ఎస్ పార్టీ మణుగూరు కార్యాలయం పై కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు దాడి చేయడం సరికాదు అన్నారు. 

 ఇటువంటి పనికిమాలిన పనులు మానుకొని ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. దాడికి ప్రతి దాడులు కూడా ఉంటాయని తెలియజేస్తూ పార్టీ కార్యాలయం దాడిలో పాల్గొన్న  ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు చేయడం రవికుమార్ దర్ర దామోదర్, గడ్డం వివేక్, జక్కుల సమ్మయ్య, జజ్జరి నారాయణమ్మ, ఆదిలక్ష్మి, శ్రీదేవి పాల్గొన్నారు.