calender_icon.png 22 November, 2025 | 1:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసుల కస్టడీలో ఐబొమ్మ రవి

21-11-2025 12:00:00 AM

  1. చంచల్‌గూడ జైలు నుంచి సైబర్ క్రైమ్ పీఎస్‌కు తరలింపు
  2. ఐదు రోజుల పాటు విచారణ
  3. బయటపడనున్న పైరసీ గుట్టు

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ (విజయక్రాంతి): తెలుగు సినీ పరిశ్రమను గడగడలాడించిన ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు, పైరసీ కేసులో ప్రధాన నిందితుడైన ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఐదు రోజుల పాటు కస్టడీకి నాంపల్లి కోర్టు బుధవారం అనుమతించిన నేపథ్యంలో గురు వారం ఉదయం చంచల్‌గూడ జైలులో ఉన్న అతడిని అదుపులోకి తీసుకుని, బషీర్‌బాగ్‌లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు తరలిం చారు.

ఐదు రోజుల పాటు సాగనున్న ఈ విచారణలో, పోలీసులు పైరసీకి సంబంధించిన వివిధ కోణాల్లో రవిని ప్రశ్నించను న్నారు. కరేబియన్ దీవుల కేంద్రంగా 66 మిర్రర్ వెబ్‌సైట్లను ఎలా నిర్వహించాడు? విదేశాల్లోని సర్వర్ల వివరాలు, ఈ నెట్వర్క్‌లో సహకరించిన ఇతర వ్యక్తులెవరు? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

పైర సీ వెబ్‌సైట్ల ద్వారా గేమింగ్, బెట్టింగ్ యా ప్లకు యూజర్లను ఎలా మళ్లించాడు? ఆ యాప్‌ల నిర్వాహకులతో ఉన్న సంబంధా లు, ఆర్థిక లావాదేవీలపై ప్రధానంగా దృష్టి సారించారు. 50 లక్షల మంది యూజర్ల డే టాను ఎలా సేకరించాడు? ఆ డేటాను సైబ ర్ నేరస్థులకు ఎలా విక్రయించాడు? అనే అంశాలపై లోతుగా ప్రశ్నిస్తున్నారు. పైరసీ ద్వారా సంపాదించిన రూ.20 కోట్లతో ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టాడు? క్రిప్టో కరెన్సీ, విదేశీ ఖాతాల్లో ఇంకా ఏమైనా నిధులు ఉన్నాయా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.