31-10-2025 01:21:39 AM
 
							ఎమ్మెల్యే హరీష్‌బాబు
బెజ్జూర్, అక్టోబర్ 30(విజయ క్రాంతి): అర్హులందరికీ పథకాలు వర్తింప చేస్తామని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎమ్మె ల్యే గురువారం 63 మంది లబ్ధిదారులకు అధికారులతో కలిసి ఇందిరమ్మ ఇంటి మం జూరు పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లబ్ధిదారులు ఎనిమిది నెలల్లో ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని సూచించారు. ఆదివాసీలకు ఇల్లు మంజూరు చేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకుంటే అర్హులైన ప్రతి ఒక్కరికీ మంజూరు చేస్తామని చెప్పారు. అకాల వర్షాలతో పత్తి, వరి పంటలకు నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు, వర్షాల వల్ల తెగిన రోడ్లకు వెంటనే మరమ్మత్తులు చేపడతామని, వంతెనల మంజూరుకు నివేదికలు పంపినట్లు చెప్పారు.రోడ్డు పనులు పూర్తయ్యాక గూడెం వరకు బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బాపుగూడ గ్రామానికి వంతెన రోడ్డు నిర్మాణం కోసం భూమి పూజ చేసినట్లు తెలిపారు.
ప్రతి గ్రామానికి రెండు సీసీ రోడ్లు మంజూరు చేయించే దిశగా కృషి చేస్తున్నానని చెప్పారు. బెజ్జూర్ మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నానని తెలిపారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామ్మోహన్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, శంకర్ గౌరీశంకర్, మాజీ ఎంపీపీ కొప్పుల శంకర్, పార్టీ అధ్యక్షులు జాడి తిరుపతి, వశీవుల్లా ఖాన్, గూడ రాకేష్, బిక్షపతి, సామల తిరుపతి, దిగంబర్ తదితరులు పాల్గొన్నారు.