05-01-2026 01:05:07 AM
జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి
కుమ్రంభీం ఆసిఫాబాద్, జనవరి ౪ (విజయక్రాంతి): జిల్లాలోని మున్సిపాలిటీ లలో వార్డుల వారీగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. ఆదివారం జిల్లాలోని ఎం. సి. గఫి ఆంగ్ల మాద్యమ పాఠశాల, డి. ఎ. వి. లక్ష్మీ పత్ సింఘానియా పాఠశాలలను సందర్శించి కాయ పోలింగ్ కేంద్రాల పరిధిలో కల్పిస్తున్న సౌకర్యాలు, సమగ్ర ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, మున్సిపల్ కమిషనర్ లతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీల పరిధిలోని వార్డులలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు.
ఓటర్ల జాబితాను టి ఈ పోల్ పోర్టల్ లో అందుబాటులో ఉంచ డం జరిగిందని, నియోజకవర్గాల పోలింగ్ కేం ద్రాల వారిగా ఓటరు జాబితా ఉంటుందని, మున్సిపల్ ఓటర్లను వార్డుల వారిగా మ్యాపిం గ్ చేయాలని తెలిపారు. చనిపోయిన, వలస వెళ్లిన ఓటర్ల తొలగింపు కొరకు ఎన్నికల సం ఘం నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసి జాబితా నుండి తొలగించే విధంగా చర్య లు తీసుకోవాలని సూచించారు. ముసాయి దా జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిశీలించాలని, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ఏజెంట్ల సమన్వయంతో స్పష్టమైన జాబితా రూపొందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.