calender_icon.png 21 December, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మతాలను కించపరిస్తే శిక్షించేలా చట్టం తెస్తాం

21-12-2025 12:45:23 AM

  1. అన్ని మతాలకు సమాన గౌరవం
  2. డిసెంబర్ ‘అద్భుత’ మాసం 
  3. ప్రభువు బోధనల స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోంది
  4. క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ 20 (విజయక్రాంతి) : ఎవరైనా ఇతర మతాలను కించపరి చినా.. మాట్లాడినా.. వ్యవహరించినా శిక్షించేలా  శాసన సభలో చట్టం తెస్తామని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అన్ని మతాలకు సమాన గౌరవాన్ని కల్పిస్తామని, మైనారి టీలకు అందించే సంక్షేమం ఎవరి దయ కాదని, అది వారి హక్కు అని స్పష్టం చేశారు. శనివారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.

తొలుత క్రిస్టియన్లకు తెలంగాణ ప్రభు త్వం తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఏసుక్రీస్తు జన్మించిన డిసెంబర్ నెల.. అద్భుత మాసమని పేర్కొన్నారు. ఈ నెల క్రీస్తు ఆరాధకులకు మా త్రమే కాదు, తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక మిరాకిల్ మంత్ అని తెలిపారు. కాంగ్రెస్ అధినేత్రి, తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ పుట్టింది.. ఈ నెలలోనే అని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నెల కూడా ఇదేనని పేర్కొన్నారు.

 ప్రభువు బోధనల స్ఫూర్తితోనే..

ప్రభువు బోధనల స్ఫూర్తితో ప్రజా ప్రభు త్వం పనిచేస్తోందన్నారు. మానవ సేవయే మాధవ సేవగా భావించి.. ప్రేమను పంచాలి, శాంతిని పెంచాలి అని ఏసుక్రీస్తు చాటారని, ద్వేషించే వారిని సైతం ప్రేమించాలని మానవాళికి ఏసుక్రీస్తు సందేశం ఇచ్చారని వివరిం చారు. ఎవరు ఎన్ని విధాలుగా ఇబ్బం ది పెట్టి నా, దుష్ప్రచారం చేసినా రాష్ట్రంలో శాంతిని కాపాడుతూ, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు.

పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అందిస్తున్నామని, 50 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ అందించి పేదల కుటుంబాల్లో వెలుగులు నింపామన్నారు. ఆనాడు ఆహార భద్రత చట్టం తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ఇవాళ రాష్ట్రంలో 3 కోట్ల 10 లక్షల మంది పేదలకు సన్న బియ్యం అందిస్తున్నామని చెప్పారు. పేదలను మా కుటుంబ సభ్యులుగా భావించి వారికి సన్న బియ్యం అందిస్తున్నామని చెప్పా రు. రుణమాఫీ చేసి సన్న వడ్లకు 500 బోనస్ అందించి వ్యవసాయాన్ని పండగ చేశామన్నారు.

క్రిస్టియన్ మిషనరీలు విద్య, వైద్యాన్ని ప్రాధాన్యతగా తీసుకుని పేదలకు అందించాయని తెలిపారు. ఎవరి మతాన్ని వారు ఆచరి స్తూనే ఇతర మతాలను గౌరవించాలని సూ చించారు. మత ప్రాతిపదికన దాడులు చేయాలని చూసినవారిని, అలాంటి ఘటనలను ప్ర భుత్వం అణచి వేసిందన్నారు. క్రిస్టియన్, ము స్లిం స్మశాన వాటికల సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. తెలంగాణ రైసింగ్ 2047 విజ న్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా రాష్ట్రాన్ని అ భివృద్ధిలో ముందుకు తీసుకెళతామన్నారు.   

విద్వేషపూరిత ప్రసంగాల కట్టడి కోసం చట్టం

తెలంగాణలో ద్వేషపూరిత ప్రసంగాల కట్టడి కోసం సీఎం రేవంత్‌రెడ్డి కొత్త చట్టం తీసుకురానున్నారు. క్రిస్మస్ వేడుకలకు హాజరైన సీఎం ఈ మేరకు ప్రకటన చేశారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే శక్తులను అడ్డుకునేందు కే కర్ణాటక ప్రభుత్వం అలాంటి చట్టాన్ని తీసుకొచ్చిందని వెల్లడించారు. తెలంగాణలోనూ అలాంటి చట్టం రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే.. సీఎం వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశమయ్యా యి. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తున్నది. ఆ తరహా చట్టం అమలైతే.. ప్రజల భావప్రకటనా స్వేచ్ఛకు అర్థమేమిటని ప్రజాస్వామిక వాదులు ప్రశ్నిస్తున్నారు.