26-11-2025 12:00:00 AM
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్, నవంబర్ 25 (విజయ క్రాంతి): జిల్లాలో రెండవ అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన మూసిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని, మూసీ గెస్ట్హౌస్ను పునరుద్ధరణ చేపడుతామని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. మంగళవారం కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టులో ఉచిత చేపపిల్లలను పంపిణీ చేశారు.మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం ఉచిత చేపపిల్లల పంపిణీ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
మూసీ ప్రాజెక్టులో 19 లక్షల చేపపిల్లలను విడిచినందుకు సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో నకిరేకల్ నియోజకవర్గంలోని చెరువులకు మొత్తం కోటి ఐదు లక్షల చేపపిల్లలను పంపిణీ చేసినట్లు తెలిపారు.మూసీ ప్రాజెక్ట్ ద్వారా 30 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం బోటింగ్ సౌకర్యం కూడాఏర్పాటుచేయనున్నట్లు చెప్పారు. మూసీలో వ్యర్థ పదార్థాలు పారబోతే ప్రభుత్వ నియమాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గుత్తామంజులమాధవ్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, మూసీ ప్రాజెక్ట్ డి.ఇ. చంద్రశేఖర్, ఏ.ఇ. మధు, మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్లు వెలుగు రవి, మెరుగు వెంకన్న, చనగాని వీరయ్య, మూసి మత్స్యశాఖ పాలకవర్గ సభ్యులు అల్వాల వెంకటస్వామి, సాదుల నరసయ్య, కొరివి యాదగిరి, రావుల వీరయ్య, ఈదుల యాదగిరి, అల్లి సైదులు, లక్ష్మయ్య, బత్తిని సైదులు, కనుగు వెంకటనారాయణ, మాదలక్ష్మీనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.