calender_icon.png 21 November, 2025 | 2:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దపల్లిలో నిర్వీర్యం అయిన గ్రంథాలయ వ్యవస్థను అభివృద్ధి చేస్తాం

21-11-2025 01:03:49 AM

జిల్లా కేంద్రంలో గ్రంధాలయ నూతన భవనానికి శంకుస్థాపనలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు

పెద్దపల్లి, నవంబర్20(విజయక్రాంతి) పెద్దపల్లి నియోజకవర్గంలో నిర్వీర్యం అయి న గ్రంథాలయ వ్యవస్థను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే చింతకుంట విజయ రామా రావు అన్నారు.జిల్లా కేంద్రంలో గ్రంధాలయ నూతన భవన నిర్మాణం కోసం డి.ఎం. ఎఫ్.టి ద్వారా రూ.1 కోటి 50 లక్షల రూపాయల నిధులతో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ తో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే గురువారం శంకుస్థాపన చేశారు.

అనంతరం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరిగిన 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా గ్రం థాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, ఎమ్మెల్యే ను శాలువాతో సన్మానించి, నిప్పుల వాగు గ్రంధాన్ని బహుకరించారు.తదుపరి జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా వారం రోజులపాటు నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యా ర్థిని విద్యార్థులకు, ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..జిల్లా కేంద్ర గ్రంథాలయ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసుకుని, జాతీయ గ్రంథాల య వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. గత ప్రభుత్వం గ్రంథాలయాలను పూర్తిగా విస్మరించిందని అన్నారు. వివిధ ప్రాంతాల ప్రజ లు మైగ్రేట్ అయి, ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకోవడం వల్ల, దినదినం పెద్దపల్లి పట్టణ జనాభా పెరిగిపోతుందని తెలిపారు.

30, 40 సంవత్సరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నా రు. ఆర్ అండ్ బి అధికారులతో మాట్లాడి, జిల్లా కేంద్ర గ్రంథాలయానికి 12 గుంటల స్థలాన్ని కేటాయించి, ఒక కోటి 50 లక్షల రూపాయల డి.ఎం.ఎఫ్.టి నిధులు మంజూ రు చేయించడం జరిగిందన్నారు.

సంవత్సరంలోపు బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, ఎంఈఓ సురేందర్ కుమార్, మాజీ కౌన్సిలర్లు, గ్రంథాలయ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ పాఠశాలల ఉపా ధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.