calender_icon.png 21 November, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎర్రనీళ్లతో వీధి కుక్కలకు చెక్

21-11-2025 01:02:19 AM

చేవెళ్ల, నవంబర్ 20: వీధి కుక్కల బెడద నుంచి తప్పించుకునేందుకు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపల్ పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీ ప్రజలు ఓ ఆలోచన చేశారు. ఇంస్టాగ్రామ్ రిల్స్ లలో వచ్చిన వీడియో ఆధారంగా చిరు ప్రయత్నం చేశారు. ఎర్ర నీళ్లతో ఖాళీ వాటర్ బాటిళ్లలో నింపి ఇంటి ముందు ఏర్పాటు చేశారు. ఆ ఎర్ర నీళ్లను చూసి వీధి కుక్కలు ఇంటి దగ్గరకు రాకుండా రోడ్డుపై ఉంటున్నాయని వారు చెబుతున్నారు.

వీధి కుక్కల బెడద తీర్చాలని పలుమార్లు మున్సిపల్ అధికారులకు చెప్పిన పట్టించుకోవడంతో తాము ఈ చిన్న ప్రయత్నం చేశామని తెలిపారు. ఇంటికి ముందుకు రావడం లేదు కానీ కాలనీలో 30కి పైగా  వీధి కుక్కలు సంచరిస్తున్నాయి. వీధి కుక్కల బెడద చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని అన్ని కాలనీ విపరీతంగా పెరిగి ప్రజలు ఇబ్బందులు పెడుతున్నాయి. 

పట్టణ కేంద్రంలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉంది. రాత్రి పూట ఒంటరిగా వెళ్లాలంటే వీధి కుక్కలు ఎక్కడ దాడి చేస్తాయోనని చాలా మంది భయపడుతున్నారు. ఇటీవల అంబేద్కర్ నగర్ కాలనీలో వీధి కుక్కలు దాడి చేసి 17 పంది పిల్లలను చంపి తిన్నాయి. కుక్కల బెడద తీర్చాలని పలుమార్లు వార్తలు కూడా వచ్చాయి. ఏది ఏమైనా కాలనీ వాసులు వీధి కుక్కల బెడద కోసం ఎర్రనీళ్ల ఆలోచన బాగుందని చర్చించుకుంటున్నారు.