calender_icon.png 23 October, 2025 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటాం

23-10-2025 02:02:14 AM

కన్నాయిగూడెం,అక్టోబరు22(విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం లోని ముప్పనపల్లి గ్రామానికి చెందిన ఇటుకల యశోద 36 సం‘రాలు గత వారం రోజుల నుండి జ్వరం వచ్చింది లోకల్ ట్రీట్మెంట్ తీసుకుంది అయిన జ్వరం తగ్గలేదు బాగా సీరియస్ గా ఉందని మూడు రోజుల క్రితం హన్మకొండలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో అడ్మిన్ చేశారు. ఐసీయూలో ట్రీట్మెంట్ పొందుతుంది.

డాక్టర్స్ టెస్టులు చేసి లివర్ డ్యామేజ్ మరియు పేగులకు పుండు అయిందని చెప్పారు. ఇప్పటి వరకు లక్ష రూపాయలు ఖర్చు అయినాయి.ఇంకా 2లక్షల రూపాయలు వరకు ఖర్చు అవుతాయి అని డాక్టర్స్ చెప్పారు. యశోదకు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి.

ఒక అబ్బాయికి అంగవైకల్యం ముగ్గురు చిన్న పిల్లలే యశోద కూలి చేస్తే గాని పూటగడవని కుటుంబం కావడంతో మా అమ్మ ట్రీట్మెంట్ కు దాతలు సహాయం చేసి ఆదుకోగలరని కొడుకు దీన స్థితిలో వేడుకొగా ముప్పనపల్లి సహాయ నిధి దాతల ద్వారా సెకరించి బు ధవారం వరంగల్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న యశోదను పరామర్శించి 10వేల రూపాయలు సహాయం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహాయ నిధి సభ్యులు ఎండీ ఫైజోద్దీన్ పాల్గొన్నారు.