12-09-2025 12:06:37 AM
కల్వకుర్తి రూరల్, సెప్టెంబర్ 10: కల్వకుర్తి పట్టణంలోని ప్ర ధాన చౌరస్తాలు, జన సమీకరణ ప్రాంతాల్లో పారిశుధ్యం అస్తవ్య స్తంగా మారింది. ఆయా దుకాణా లు హోటల్లో టీ టిఫిన్ దుకాణాల్లో నుండి వెలువడిన మురుగునీరు రోడ్లపైనే పారుతుండడంతో వాటి ఫలితంగా దోమలు ఈగలు వ్యాప్తి చెంది సామాన్యులు రోగాల బారిన పడుతున్నారు. చెత్త సేకరణ లోను నిర్లక్ష్యం వహించడంతో ముక్కుపుటాలు అదే దుర్వాసన వెదజల్లుతోందని పాదాచారులు స్థానికులు మండిపడుతున్నారు.
అయినా సంబంధిత మున్సిపల్ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తూ అలసత్వం ప్రదర్శిస్తున్నారు. జలుబు దగ్గు జ్వరం వంటి వ్యాధులతో పాటు డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు సామాన్యులపై దండెత్తుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఇంట్లో ఇద్దరు ముగ్గురు వ్యాధులు సోకి మంచాన పడుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు పారిశుద్ధ్యం నిర్వహణలో చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.