21-01-2026 01:46:16 AM
హైదరాబాద్, జనవరి 20: ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రొఫెసర్, అవుటా (ఓయూటీఏ) అధ్యక్షుడు మనోహర్ సస్పెన్షన్ వేటును తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్రంగా పరిగణించారు. మంగళవారం యూనివర్సిటీకి చేరుకున్న మల్లన్న, అక్కడి పరిస్థితులను చూసి అధికారుల తీరుపై నిప్పులు చెరిగారు. ‘ఎమ్మెల్సీగా సమస్యపై చర్చించడానికి వస్తే భయపడి పారిపోతారా?
కుర్చీలో కూర్చునే అర్హత మీకు ఉందా? బీసీ ప్రొఫెసర్ల జోలికొస్తే సహించేది లేదు. మీ అరాచకాలు సాగనిస్తే నా పేరు మల్లన్నే కాదు ఖబడ్దార్’ అంటూ వీసీ, రిజి స్ట్రార్‌ను హెచ్చరించారు. చట్టం ముందు మిమ్మ ల్ని నిలబెడుతానని హెచ ్చరించారు. “విశ్వవిద్యాలయం ప్రజాస్వామ్య బద్ధంగా నడవాలి కానీ, మీ సొంత జాగీరులా వ్య వహరిస్తామంటే కుదరదని, ప్రొఫెసర్లను గేటు బయట ఆపే సంస్కృతికి ఇక్కడితో చరమగీతం పాడకపోతే సహించం’ అని హెచ్చరిచారు.
గేటు బయట ప్రొఫెసర్‌ను ఆపిన వారితో క్షమాపణ లు చెప్పించారు. ప్రొఫెసర్ మనోహర్‌పై సస్పెన్షన్ ఎత్తివేయాలని, లేదంటే పరిణామాలు చా లా తీవ్రంగా ఉంటాయని ఈ సందర్భంగా మల్లన్న హెచ్చరించారు. యూనివర్సిటీకి మల్ల న్న వెళ్లగా వీసీ, రిజిస్ట్రార్ పారిపోవడంతో అక్కడి నుంచే మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలతో ఫోన్‌లో మాట్లాడిన మల్లన్న.. “ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్న ఇలాంటి అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని మంత్రులు సానుకూలంగా స్పందించారు.
ఇది బీసీల ఆత్మగౌరవ సమస్య అని, న్యాయం జరగకుంటే ఉస్మానియాను అడ్డాగా చేసుకుని అరాచకాలు చేసే అధికారులను తరిమితరిమి కొడతామని, అవసరమైతే రాష్ట్రాన్ని కదిలించి అన్యాయాన్ని అడ్డుకుంటాం అని మల్లన్న స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధి వస్తున్నారని తెలిసి విధులకు గైర్హాజరైన వీసీ, రిజిస్ట్రార్‌లపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.