21-01-2026 01:30:40 AM
గంగిరెద్దుల నేతల చేరిక
రానున్న ఎన్నికల్లో టీఆర్పీనీ అధికారంలో తీసుకురావడమే లక్ష్యం
తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, జనవరి 20: హైదరాబాద్‌లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యా లయంలో గంగిరెద్దుల సామాజిక వర్గానికి చెందిన పలువురు కీలక నాయకులు పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమక్షంలో మంగళవారం పార్టీలో చేరారు. వారికి మల్లన్న పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రభుత్వం బీసీల సంక్షేమం గురించి గొప్పలు చెబుతున్నా, వాస్తవానికి జరుగుతున్నది వేరని మల్లన్న విమర్శించారు.
‘తరతరాలుగా ఇతరులను యాచిం చే స్థితిలో ఉన్న గంగిరెద్దుల వర్గాల వారు, రేపటి రోజున ఈ రాష్ట్రానికి పాలకులు కావాలి‘ అని మల్లన్న పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని మల్లన్న కోరారు. కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుధగాని హరిశంకర్ గౌడ్, ఉపాధ్యక్షులు ఎల్లబోయిన ఓదెలు యాదవ్ పాల్గొన్నారు.
చేవెళ్ల నాయకులతో చర్చలు
టీఆర్పీ రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యమ్ జనార్ధన్ ముదిరాజ్ అధ్వ ర్యంలో చేవెళ్లకు చెందిన నాయకులు రాబో యే మున్సిపల్ ఎన్నికల్లో విజయం గురిం చి పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్నను, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదగాని హరిశంకర్‌గౌడ్‌లతో చర్చించారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి కట్టుగా పని చేసి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మేజార్టీ స్థానాల్లో టిఆర్పి జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్పీ చేవెళ్ల మం డల అధ్యక్షుడు అశోక్, షాబాద్ మండల అధ్యక్షులు కావాలి శంకర్, మండల ప్రధాన కార్యదర్శి శివ కుమార్, నాయకులు కుర్ర వెంకటేష్, ఈ ప్రభాకర్, వడ్డె హరీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.