14-11-2025 12:39:38 AM
-టికెట్‌యేతర ఆదాయంపై దృష్టి
-వచ్చే డిసెంబర్ చివరిలోగా ఆర్టీసీలో ఉద్యోగాల నోటిఫికేషన్
-రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి) : ఆర్టీసీని లాభాల పట్టించేందుకు ఆదాయ మార్గాలపై అధ్యయనం చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. అందుకు టికెట్ ఆదాయంతో పాటు టికెట్‌యేతర ఆదాయంపై దృష్టి సారించాలని సూచించారు. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్‌లలో, టీమ్ మిషన్‌ల ద్వారా వచ్చే టికెట్‌పై అడ్వర్టుజ్మైంట్స్ ద్వారా ఆదాయాన్ని మరింత పెంచాలని దిశా నిర్దేశం చేశారు. గురువారం సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి మట్లాడారు.
నగరంలో నలువైపులా బస్‌స్టేషన్‌లు ఉండేలా చర్యలు చే పట్టాలని సూచించారు. అందులో భాగం గా మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌పై ఒత్తిడి తగ్గించేందుకు జుబ్లీ బస్‌స్టేషన్ తరహాలో ఆ రాం ఘర్‌లో అధునాతన బస్ టెర్మినల్ ఏ ర్పా టు చేయాలన్నారు. ఇందుకోసం పోలీస్ శాఖ నుంచి భూ బదలాయింపుపై ఆర్టీసీ అధికారులు దృష్టిపెట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ఫ్యూచర్ సిటీలో సైతం బస్ టెర్మినల్ ఏర్పాటుపై దృష్టి పెట్టాలని, ఉప్పల్‌లో కూడా బస్‌స్టేషన్ నిర్మించడానికి అధ్యయనం చేయాలని సూచించారు.
ఆ..డిపోలపై ప్రత్యేక కమిటీ
తాండూరు, వికారాబాద్, బీహెచ్‌ఈఎల్, మియాపూర్, కుషాయిగూడ, దిల్ సుఖ్ నగర్, హకీంపేట్, రాణిగంజ్, మిథానితోపాటు పలు డిపోలు నష్టాల బారిన పడడా నికి గల కారణాలు, స్థానిక పరిస్థితులు, ఆయా డిపోలు లాభాల బాట పట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిటీ వేయాలనిఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని ఆదేశించారు. మేడారం జాతర సమీపిస్తుండడంతో ములుగు జిల్లా బస్‌స్టేషన్ నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
వచ్చే డిసెంబర్ చివరిలోపు 84 ట్రాఫిక్ సూపర్వుజర్ ట్రైనీ, 114 సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కానుందని తెలిపారు. కారుణ్య నియామకాల కింద చేరిన ఆర్టీసీ కండక్టర్లకు ఉన్న మూడేళ్ల ప్రొవిజన్ రెండేళ్లకు తగ్గించేలా పరిశీలన చేయాలని సూచించారు. స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఇతర ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.