calender_icon.png 20 August, 2025 | 10:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల సమస్యలు పరిష్కరిస్తాం

13-08-2024 01:24:41 AM

ఏపీ మంత్రి నారా లోకేశ్ 

హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): కష్టాల్లో ఉన్నామంటే చాలు క్షణం ఆలోచించకుండా సమస్యలు పరిష్కరిస్తామని ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. సోమవారం ఉండవల్లిలోని నివాసంలో 24వ రోజు ప్రజా దర్బార్‌కు వచ్చిన  ప్రజల సమస్యలను విన్నారు. నిర్లక్ష్యం చేయకుండా ప్రతి సమస్యకు పరిష్కారం చూపాలని ఆదేశించారు. దీంతో ప్రజా దర్బార్‌కు వచ్చిన ప్రజలు హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆటో కార్మికుల సంక్షేమం కోసం ఆటో పార్కు ఏర్పాటు చేయాలని మోటా ర్ టెక్నీషియన్ వర్క్‌ర్స్ యూనియన్ ప్రతినిధులు కోరారు.