calender_icon.png 21 August, 2025 | 3:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆసుపత్రులను ఉత్తమంగా తీర్చిదిద్దాలి

13-08-2024 01:26:28 AM

సమీక్షలో ఏపీ సీఎం చంద్రబాబు 

హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల ను దేశంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన వైద్య రంగంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖలో ఉత్తమ విధానాలు అమలు చేయాలని, టెలీ మెడిసిన్ సేవద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించాలని సూచించారు.

రాష్ట్రంలో ఎక్కడా డోలీ మోతలు వినిపించవద్దని, ఫీడ ర్ అంబులెన్స్‌ల ద్వారా రోగులను తరలించాలని, క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన నకిలీ సదరం ధ్రువపత్రాలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పంచాయతీరాజ్ శాఖ సమన్వయంతో నకిలీ పత్రాలు కట్టడి చేయాలని, ప్రతి నియోజకవర్గంలో పీపీపీ విధానంలో ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఆ ఆసుపత్రికి ప్రభుత్వమే స్థలం ఇస్తుందని, ప్రభుత్వ, పీపీపీ ఆసుపత్రులను ఒకే గొడుగు కిందకు తెస్తామని తెలిపారు.  ప్రభుత్వం తరఫున యాప్ రూపొందించాలని, హెల్త్‌కార్డుతో ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన వ్యక్తి వివరాలు నమోదు చేయాలని పేర్కొన్నారు.

ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో బాబు భేటీ

రెండు రోజులుగా అమరావతిలో పర్యటిస్తున్న ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. సోమవారం సచివాలయంలో పురపాలక పట్టణా భివృద్ధి శాఖ మంత్రి నారాయణ, సీఆర్డీయే కమిషనర్ కాటంనేని భాస్కర్‌తో కలిసి సమావేశమయ్యారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా శనివారం విజయవాడకు వచ్చిన బృందం మధ్యాహ్నం వరకు ఆర్డీయే ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా అమరావతి ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిని అధికారులు వివరించారు. శనివారం మధ్యాహ్నం అమరావతిలో నిర్మాణంలో ఉన్న  భవనాలను పరిశీలించారు. ఆదివారం రాజధా నిలోని రోడ్డును, కొండవీటి వాగు ఎత్తిపోతల పంప్‌హౌస్‌లను పరిశీలించడంతో పాటు విట్, ఎస్‌ఆర్‌ఎం, ఎయిమ్స్‌లను సందర్శించారు. సోమవారం సీఎంతో భేటీ అయ్యారు. ప్రపంచస్థాయి రాజధాని అమరావతి నిర్మాణంలో ఎలా ముందు కెళ్లుతుం దనే అంశంపై ప్రతినిధులకు బాబు వివరించారు. ప్రపంచలోని ఉత్తమ ప్రమాణాలు, ఆధునిక టెక్నాలజీ ఉపయోగించుకుని అమరావతి నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు.