calender_icon.png 9 December, 2025 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే అండగా ఉంటాం

09-12-2025 02:06:54 AM

ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే రోహిత్

పాపన్నపేట, డిసెంబర్ 8: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని, అన్నిటికి అండగా ఉంటామని మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కోరారు. సోమవారం మండల పరిధిలోని గాంధారిపల్లి, జయపు రం, అబ్లాపూర్, అన్నారం, ఆరెపల్లి, కుర్తివా డ, దౌలపూర్, పాత లింగాయిపల్లి, కొత్త లింగాయిపల్లి, కొంపల్లి, తమ్మాయిపల్లి గ్రా మాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులతో ప్రచారం నిర్వహించారు.

అనంతరం ఎమ్మెల్యే రోహిత్ మాట్లాడుతూ.. పార్టీ బలపరిచిన అభ్యర్థులకు పూర్తి మద్దతు ఉం టుందన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చే యాలని కోరారు. గ్రామానికి ప్రత్యేక నిధు లు కేటాయించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తుందన్నారు. ఆయన వెంట మండల నాయకు లు ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, గోవింద్ నాయక్ తదితరులు ఉన్నారు.