calender_icon.png 29 December, 2025 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యల వలయంలో వారాంతపు సంత

29-12-2025 01:39:31 AM

నేషనల్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం

ట్రాఫిక్ నియంత్రించే రక్షకభటులు ఎక్కడ??

కనీస సౌకర్యాలు కల్పించని నగరపాలక సంస్థ..

భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 28, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో వారంతపు  సంత సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రసిద్ధిగాంచి న వారాంతపు సంత సింగరేణి ప్రధాన కా ర్యాలయం సమీపంలో నిర్వహిస్తుంటారు. ఒకవైపు చాలీచాలని సౌకర్యాలు, మరోవైపు రోడ్డుకు విరువైపులా దుకాణాలతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం, ప్రమాదాలు పొంచి ఉన్నాయి. నగరపాలక సంస్థ రైతుల నుంచి ముక్కు పిండి పన్ను వసూలు చేస్తున్న వారికి సరైన కనీస సౌకర్యాలు కల్పించుటలో అధికారులు అలసత్వం వహిస్తున్నా రని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలీచాలని సౌకర్యాలతో వ్యాపారం చేయలేకపోతున్నామని వ్యాపారులు వాపోతున్నారు. సంతలో శాఖాహారం, మాంసాహారం రెండు విభాగాలుగా వేరువేరుగా ఉండాలని నిబంధనలు ఉన్న, రెండు పక్క పక్కనే  ఉండ టంతోవినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

మాంసం దుకాణాల నుంచి వచ్చే దుర్గంధం వల్ల ముక్కు మూసుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ఒకవైపు అసౌకర్యాలు, వైపు దుర్గంధం ఇవి చాలా ఉన్నట్లు తీవ్ర ట్రాఫిక్ సమస్య నడుమ వినియోగదారులు అనేక ఇబ్బందులను ఎదు ర్కొంటున్నారు. రైతుల నుంచి పన్నుల రూ పేనా వసూలు చేస్తున్న అధికారులు సరైన సౌకర్యాలు కల్పించకపోవడం శోచనీయం.మాంసం విక్రయించే దుకాణం , రోడ్డుకు పక్కనే ఉండటం వల్ల సామాన్య ప్రజలకు , శాఖాహారులకు చాలా ఇబ్బంది కలుగుతోంది.

మాంసం వ్యాపారులకు కేటాయించినటువంటి స్థలంలో వారు వ్యాపారం చేసుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదనీ వినియోగదారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మాంసాహారం, శాఖాహారం రెండు వేరువేరుగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.రోడ్డుపైనే దు కాణాలు పెట్టడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతోంది.  కూరగాయల వ్యా పారులు, రోడ్డు కిరువైపులా హైవేకు  కూరగాయలు , అల్లం ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ లుగా విక్రయించడంతో వాహనదారులు, పాదాచారులు , ద్విచక్ర వాహన చోధకులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అసలే విజయవాడ జాతీయ రహదారి కావడం రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రమాదాలు పొంచి ఉందని ఆందోళన చెందుతున్నారు.

ట్రాఫిక్ నియంత్రణ చేసే నాధుడే కరువయ్యారు.జాతీయ రహదారికి రెండు వైపులా నిబంధనలకు విరుద్ధంగా  కూరగాయలు, చాపలు, మాంసం దుకాణాలు ఏర్పాటు చేస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సంత కోసం కేటాయించిన ప్రాంతంలోనే వ్యాపారాలు జరిగేలా చూడాలని, పోలీస్ శాఖ ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని కొత్తగూడం పట్టణ ప్రజలు కోరుతున్నారు.