02-11-2025 07:25:47 PM
నిర్మల్ (విజయక్రాంతి): ఆదివారం జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి కె.లక్ష్మణ్ కు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ స్వాగతం పలికారు. పట్టణంలోని అటవీ వసతి గృహంలో అదనపు కలెక్టర్, న్యాయమూర్తికి పూల మొక్కలు అందజేసి స్వాగతం పలికారు. న్యాయమూర్తికి స్వాగతం పలికిన వారిలో జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి, ఏఎస్పీ రాజేష్ మీనా, ఆర్డీవో రత్న కళ్యాణి, ఇతర అధికారులు, తదితరులు ఉన్నారు.