calender_icon.png 4 July, 2025 | 6:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

04-07-2025 12:23:11 AM

 రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు 

ఖమ్మం, జూలై  03 ( విజయ క్రాంతి):అర్హులైన పేదలకు సంక్షేమ పథకా లను తప్పనిసరిగా అ మలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.మంత్రి, గురువారం రఘునాధపాలెం మండలం వేపకుంట్ల గ్రామంలో పర్యటించి ఎస్సీ కాలని నందు సి.ఆర్.ఆర్. నిధులు 50 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ తొలి విడతలో గుడిసెల్లో ఉన్న నిరుపేదలను ఎంపిక చేసి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నామని, ఇంకా ఎవరైనా గుడిసెలలో ఉన్న వారికి ఇందిరమ్మ ఇండ్లు రాని పక్షంలో ప్రతిపాదనలు అందించాలని వెంటనే మంజూరు చేస్తామని, దశల వారీగా మిగిలిన అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అవుతాయని అన్నారు.గ్రామంలో గుడిసెలో ఉంటున్న వారి ఫోటోలు తీసుకొని రావాలని మంత్రి తెలిపారు.

గ్రామంలో నిరుపేదలైన అర్హులకు ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంత రావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య, రఘునాథపాలెం మండల తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ అశోక్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, వేపకుంట్ల గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.