26-01-2026 01:25:30 AM
వెంకటాపూర్,జనవరి25,(విజయక్రాంతి):విద్యా దేవాలయంగా ఉండాల్సిన పాఠశాలే నేడు చిన్నారుల ప్రాణాలకు ముప్పుగా మా రింది.. మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (బాలికలు) లో భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడం తో విద్యార్థినులు భయాందోళనల మధ్య చదువు కొనసాగించాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. పాఠశాల భవనం పైకప్పు నుంచి పెచ్చులు ఊడి తరగతి గదుల్లో పడుతున్నాయి.
రోజురోజుకూ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుండటంతో ఏ క్షణమైనా ఘోర ప్రమాదం జరిగే అవకాశముం దని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ పాఠశాల ఇంచా ర్జి ఉపాధ్యాయురాలు ఇటీవలే మృతి చెందడంతో ప్రస్తుతానికి ఈ పాఠశాలకు ఒక్కరు మాత్రమే ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇంకో ఇద్దరి ఉపాధ్యాయుల అవసరం ఉన్న ఒక్క ఉపాధ్యాయునితో పాఠశాలను కొనసాగించడం గమనార్హం..
తరగతి గదుల్లో చదువు అంటేనే భయం
పాఠాలు జరుగుతున్న సమయంలోనే పైకప్పు నుంచి పెచ్చులు ఊడి పడుతుండటంతో విద్యార్థినులు ఒక్కసారిగా భయంతో తరగతుల నుంచి బయటకు పరుగులు తీస్తున్నారు. చిన్నారుల మనసుల్లో చదువు పట్ల ఆసక్తి కన్నా ప్రాణభయం ఎక్కువైపోయిందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆవేద న వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సందర్భాల్లో పిల్లలపై పెచ్చులు పడిన ఘటనలు చోటుచేసుకున్నాయని సమాచారం. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగకపోయినా, ఇది ప్రమాదానికి ముందు హెచ్చరికగా తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.
ఆరుబయటే తరగతులు.. విద్యా ప్రమాణాలకు తూట్లు
భవనం లోపల తరగతులు నిర్వహించ డం ప్రమాదకరమని భావించిన ఉపాధ్యాయులు కొన్నిసార్లు పాఠశాల ప్రాంగణంలో, చెట్ల నీడలోనే తరగతులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎండ, గాలి, శబ్ద కాలు ష్యం మధ్య పిల్లలు చదవాల్సి రావడం వల్ల విద్యా ప్రమాణాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.
కొన్నేళ్లుగా అదే పరిస్థితి.. అయినా మార్పు లేదు
పాఠశాల భవనం పరిస్థితి గురించి గత కొన్నేళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా నామమాత్రపు చర్యలు కూడా చేపట్టలేదని స్థానికులు ఆరోపిస్తున్నా రు. చిన్నపాటి మరమ్మతులు చేస్తూ కాలయాపన చేయడమే తప్ప, శాశ్వత పరిష్కా రం దిశగా అడుగులు వేయలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గతంలో జిల్లా అధికారులకు వినతి
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (బాలికలు) భవనం శిథిలావస్థపై గతంలోనే జిల్లా స్థాయి అధికారులకు పలుమార్లు వినతులు అందజేశారు. పాఠశాల పైకప్పు నుం చి పెచ్చులు ఊడి పడుతున్న విషయాన్ని ఉ పాధ్యాయులు రాతపూర్వకంగా, మౌఖికంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి శాశ్వత చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
ప్రమాదం జరగకముందే భవనానికి మరమ్మతులు చేయాలని, లేకపోతే ప్రత్యామ్నాయ భవనంలో తరగతులు నిర్వహించాలని తల్లిదండ్రులు, గ్రామస్థులు కోరి నప్పటికీ ఆ వినతులు ఫలితం లేకుండా మిగిలిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. అధికారుల నిర్లక్ష్యమే నేడు చిన్నారు ల ప్రాణాలకు ముప్పుగా మారిందని పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
తల్లిదండ్రుల్లో భయాందోళన..
పాఠశాల భవనం నుంచి పెచ్చులు ఊడి పడుతున్న ఘటనలతో తల్లిదండ్రుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. ఎప్పుడైనా పిల్లలపై పెచ్చులు పడితే పరిస్థితి ఏమవుతుం ది.? ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో పిల్లలను బడికి ఎలా పంపాలి.? అంటూ తల్లి దండ్రులు వాపోతున్నారు. చిన్నారుల భద్ర తే ప్రధానమని, చదువు కంటే ముందు ప్రా ణ రక్షణ ముఖ్యమని వారు స్పష్టం చేస్తున్నారు. జిల్లా అధికారులు వెంటనే స్పందిం చి పాఠశాల భవన సమస్యను పరిష్కరించకపోతే పిల్లలను బడికి పంపబోమని కొందరు తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు.