29-10-2025 12:00:00 AM
ఆమనగల్లు, అక్టోబర్ 28: కష్టపడే తత్వం, క్రమశిక్షణ అలవర్చుకుంటే విద్యార్థులు ఉన్నతంగా ఎదుగుతారని సామాజికవేత్త పాపిశెట్టి రాము అన్నారు. మంగళవారం నీట్ ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరిచి ఎంబిబిఎస్ సీటు సాధించిన విద్యార్థిని శ్రావణిని పట్టణంలో ఆయన ఘనంగా సత్కరించి శాలువాతో సన్మానించారు. తల్లిదండ్రుల కృషి, ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఉంటే విద్యార్థులు తమ అనుకున్న లక్ష్యం చేరుకుంటారని ఆయన ఆకాంక్షించారు.
రంగారెడ్డి జిల్లా కడ్తాల మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన ఈర్లపల్లి యాదయ్య,మహేశ్వరి దంపతుల కుమార్తె ఈర్లపల్లి శ్రావణి ప్రాథమిక విద్య ఆమనగల్ లో పూర్తిచేసి, ఉన్నత విద్య ఆమనగల్ గురుకుల పాఠశాల, ఇంటర్మీడియట్ గౌలిదొడ్డిలో పూర్తిచేసింది. విద్యార్థి శ్రావణి మాట్లాడుతూ కష్టపడి వైద్య విద్యను పూర్తి చేసి నిరుపేదలకు సేవ చేయడమే తన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో పూసల భాస్కర్, శ్రీను, గజ్జె యాదయ్య, ఈర్లపల్లి శ్రీశైలం పాల్గొన్నారు.