calender_icon.png 31 October, 2025 | 11:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తడిసిన ధాన్యం.. రైతన్న దైన్యం

31-10-2025 12:10:38 AM

-నిజామాబాద్ జిల్లాలో రైతుల ఆవేదన 

-తడిసి ముద్దైన అన్నదాతల ఆశలు 

-కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో నిర్లక్ష్యం   

-మండల వ్యవసాయ అధికారికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశం

ధర్పల్లి, అక్టోబర్ 30 (విజయ క్రాంతి): నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ  పరిధిలోని మోపాల్, డిచ్పల్లి, జక్రాన్ పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండ మండలాల్లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వచ్చిన పంట దెబ్బతినడంతో రైతుల పరిస్థితి దిక్కుతోచని విధంగా తయారయింది. చేతికొచ్చిన పంట అకాల  వర్షాల వాటికి దెబ్బతింది. కోత దశకు చేరుకున్న వరి ధాన్యం ముంపునీటి లో తడిసి ముద్ద అయ్యింది, వాతావరణం లో ఎండ లేక పొలాల్లోనే పంటలు పాడైపోతున్నాయి . తోడు ఆరబోసిన ధాన్యం చేతికి రాకుండా పోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రోడ్లపై ఆరబోసిన ధాన్యం మక్కలు, వడ్ల పై టార్పోలిన్ సీట్లు కప్పినప్పటికిని వారం రోజులుగా ఆరబోసిన ధాన్యం కాంట్రాక్టు వచ్చిన సమయంలో వర్షాలు రావడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇచ్చిన ధాన్యాన్ని ఆరబోయడానికి వారం పైగా పడుతుందని ఈలోపు కొన్ని ప్రాంతాల్లో తడిసిన ధాన్యం మొలకలు ఎత్తుతూ ఉండడంతో రైతుల ఆందోళన చేస్తున్నారు.  ఖరీఫ్ సీజన్లో జిల్లా 4.38. లక్షల పంట వేశారు. 52. 093, మొక్కజొన్న పంట వేయగా 33.605 ఎకరాలలో సోయా పండించారు.

అప్పటికే కోతలు పూర్తయిన మక్కా జొన్న సోయా పంటలను 50 శాతం వరకు బయటి వ్యాపారులకు విక్రయించారు. ధాన్యంలో తేమ 17% ఉండేలా చూసుకోవాలని మార్కెట్ కమిటీ నిర్దేశించినప్పటికీ చాలా చోట్ల తడిసి ముద్దయిన ధాన్యంలో తేమశాతం ఎక్కువగా వస్తోంది. ఇదిలా ఉండగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం వర్షాలు కురుస్తున్నందువల్ల పంటలను ఇప్పుడే కోయకుండా వాయిదా వేయాలని అధికారులు రైతులకు సూచిస్తున్నారు. 1. 15. ఒక 124 టన్నుల ధాన్యం సేకరించినట్టు అధికారులు తెలిపారు. 

ఆర్మూర్ నిజామాబాద్ సిరికొండ జక్రాన్ పల్లి బాల్కొండ వేల్పూర్ నందిపేట్ నవీపేట్ భీమ్గల్ ప్రాంతాలలో కురిసిన వర్షానికి వడ్లు పూర్తిగా తడిసిపోయాయి మోపాల్ తోపాటు ఇతర మండలాల్లో వర్షపు నీటి ధాటికి ఆరబోసిన పంట కొట్టుకుపోయింది.

 ఒక ప్రక్క తడిసిన ధాన్యం మొలకలు పెట్టడంతో రైతుల బాధ వర్ణాతీతంగా మారింది. ఈ దృశ్యం రైతుల కంట కన్నీరు పెట్టిస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించినా, జిల్లా అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా రని రైతులు ఆరోపిస్తున్నారు. రెండు రోజులుగా వస్తున్న వర్షాలతో పంటలు పూర్తిగా పాడైపోతున్నాయి. చేతికొచ్చిన పంట కళ్ళముందే పంటలు ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయి మొలకెత్తుతుంటే రైతులు గుండెలు బాదు కుంటున్నారు. ధాన్యం తడిసి పాడైపోతోంది... కానీ కొనుగోలు కేంద్రాలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు అని చిన్న వాల్గోట్ రైతులు వేదన వ్యక్తం చేశారు.

కొన్ని గ్రామాల్లో నామమాత్రపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనా, సరైన సిబ్బంది, తూకాలు, గోడౌన్లు లేని పరిస్థితి రైతులను ఇబ్బంది పెడుతోంది. వడ్లను తరలించేందుకు ఏర్పాటుచేసిన ట్రాక్టర్లు బరదలో కు పోయి కదలలేని రహదారుల కారణంగా రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నారు.వర్షం వల్ల పంటలు తడిసి పాడైపోతున్నాయి... ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. లేదంటే రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలను ముందే ప్రారంభించి ఉంటే ఈ నష్టం ఉండేది కాదు. జిల్లాలో రైస్ మిల్లులకు అలాట్మెంట్లు ఇవ్వకపోవడం వల్ల రైతుల వరి ఇక్కడే కుప్పలుగా మిగిలిపోయింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలాట్మెంట్ ఇచ్చిన నిజామాబాద్ మిల్లుకు గత ఐదు రోజులుగా ధాన్యం తరలించినప్పటికీ, మిల్లర్లు దించుకోవడంలేదని, పైగా నాలుగు కిలోలు, మూడు కిలోలు తరుగు తగ్గిస్తాం అంటూ రైతులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. స్థానిక రైస్ మిల్లులకు అలాట్మెంట్లు ఇస్తే పరిస్థితి కొంత సర్దుబాటు అయ్యేదని, కానీ తెలియని మిల్లులకు అలాట్మెంట్లు ఇవ్వడం రైతుల నడ్డి విరుస్తోందని తెలిపారు.సివిల్ సప్లై అధికారులు, జిల్లా కలెక్టర్ స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతుల పరిస్థితిని అంచనా వేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇకనైనా ప్రభుత్వం చొరవ తీసుకుని సన్న రకం, దొడ్డు రకం తడిసిన ధాన్యాన్ని తక్షణం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

రెంజల్ మండల వ్యవసాయ  అధికారికి సోకార్డ్ నోటీస్ జారీ

నిజామాబాద్ జిల్లా నవీపేట్ రేంజర్ మండలాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి దాన్యం కనుగోలు కేంద్రాల పై నిర్లక్ష్యం వహించిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల ఆలసత్వం వహించడానికి తీవ్రంగా పరిగణిస్తూ రెంజల్ మండల వ్యవసాయ అధికారికి శోకత్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. నవీపేట్ మండలం అవంగపట్నం తాడ్గాం రేంజర్ మండలం వీరన్న గుట్ట గ్రామాలలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గురువారం సందర్శించారు.

రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిర్దోషిత రైస్ మిల్లలకు కాకుండా వేరే రైస్ మిల్లులకు తరలించడాన్ని కలెక్టర్ తప్పు పట్టారు.  వెనువెంటనే క్యాబ్ ఎంట్రీలు చేయించడంలోనూ జాబ్ చేస్తున్నానని కలెక్టర్ అసం తృప్తి వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించని రెంజల్ మండల వ్యవసాయ అధికారికి సోకాస్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. రైతుల ప్రయోజనాలతో ముడిపడిన అంశాలలో విధుల పట్ల నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించమని హెచ్చరించారు.