calender_icon.png 30 January, 2026 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్నేహమేరా జీవితం!

27-01-2025 12:00:00 AM

ప్రేమను కోల్పోవాల్సి వచ్చినా సరే.. కానీ జీవితంలో ఎప్పుడూ స్నేహాన్ని పోగొట్టుకోకూడదు. స్నేహితులు మీతో ఉన్నప్పుడే జీవితంలో ఆనందం ఉంటుంది. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం.. వయసు ఏదైనా చాలామంది  ‘స్నేహామేరా జీవితం.. స్నేహామేరా శాశ్వతం’ అంటారు. అయితే పెళ్లి, పిల్లలు, చివరకు మలివయసుకు వచ్చేసరికి ఒకటీ, అరా స్నేహాలు మాత్రమే మిగులుతున్నాయి.

నిజానికి అరవైలో స్నేహం అవసరం ఎక్కువగా ఉందంటోంది మిషిగన్, షికాగో యూనివర్సిటీలు చేసిన అధ్యయనం. బాల్యంలోనూ, టీనేజీలోనూ చేసే స్నేహం మనకు సంతోషాన్ని ఇస్తే, పెద్దవయసులో చేసే స్నేహం మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ఇందుకు సంబంధించి యాభై ఏళ్లు పైబడిన వారిపై ఒక సర్వే చేసినప్పుడు 79శాతం మంది స్నేహం తమకి సంతోషంతోపాటూ ధైర్యాన్నీ ఇస్తోందని, మిత్రులతో మంచిచెడ్డలు మాట్లాడటంతోపాటు ఆరోగ్యం గురించి చర్చిస్తామని చెప్పారు.

అలాగే ఈ స్నేహితులు కుటుంబసభ్యుల మాదిరిగానే ఆరోగ్య సలహాలు ఇవ్వడంతోపాటూ అవసరం అయితే ఎమర్జెన్సీ సమయంలో సాయంగా కూడా ఉంటున్నారని తేలింది. కనీసం ఒక్క స్నేహితుడు  అయినా ఉండాలంటున్నారు మానసిక నిపుణులు. స్నేహం వల్ల దిగులు, ఒంటరితనంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.  

ఎన్నో లాభాలు

* భావాలు, ఆందోళనలు, ఆనందాలను పంచుకోవడానికి స్నేహితులు చాలా అవసరం. మంచి స్నేహితుడితో సంభాషిస్తే ఎలాంటి బాధనైనా ఇట్టే మరిచిపోతాం. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. 

* క్రమంతప్పకుండా స్నేహితులతో మాట్లాడటం వల్ల, కలవడం వల్ల మనసు చురుగ్గా ఉంటుంది. 

* నమ్మినా నమ్మకపోయినా స్నేహాలు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. 

* మంచి స్నేహాల వల్ల అభిరుచులు, ఆసక్తులు పెరిగి అనేక కొత్త విషయాలను నేర్చుకోవచ్చు. 

* బలమైన స్నేహాల వల్ల ఎక్కువ కాలం జీవిస్తారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. 

మంచి స్నేహం కోసం.. 

* మీ అభిరుచులను పంచుకునేవారితో స్నేహం చేయండి. 

* స్థానిక లైబ్రరీలు, పలు ఈవెంట్‌లకు వెళ్లండి. తద్వారా మీ ఆలోచనలకు తగ్గ స్నేహితులు దొరకవచ్చు. 

* అలాగే మ్యూచువల్‌గా ఆటలను ఇష్టపడేవారితో కూడా స్నేహం చేయొచ్చు. 

* కాబోయే స్నేహితులు జీవిత సవాళ్లతో మునిగిపోవచ్చు. మీరే చొరవ తీసుకొని స్నేహాన్ని కొనసాగించండి. 

* మాజీ సహోద్యోగులను స్నేహితులుగా మార్చుకోండి. 

* పాత స్నేహితులతో తిరిగి సన్నిహితంగా ఉండండి. 

* ఆన్‌లైన్‌లో కొత్త స్నేహాలను ఏర్పర్చుకోండి. 

* స్నేహం కోసం చేసిన ప్రయత్నాలు విఫలమైతే వ్యక్తిగతంగా తీసుకోకండి.