calender_icon.png 17 August, 2025 | 12:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుకను సీజ్ చేయకపోవడానికి కారణాలు ఏంటి?

13-08-2025 12:00:00 AM

  1. ముడుపులు ముడితేనే సీజ్ చేయలేదా?
  2. రాజకీయ నాయకుల ఒత్తిళ్ళా? 

ఇల్లంతకుంట ఆగస్టు 12 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇల్లంతకుంట మం డలం అక్రమంగా ఇసుక డంప్ చేశారని శనివారం విజయక్రాంతి దినపత్రికలో వచ్చిన. అక్రమ ఇసుకపై చర్యలు ఎక్కడ అనే వార్త పై ఏదో తూతూ మంత్రంగా చర్యలు తీసుకున్నారు. గతంలో మండలంలోని తాళ్లపల్లి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం కోసం ఇసుకను నిల్వ చేసిన కాంట్రాక్టర్ పై పర్మిషన్ లే దని సీజ్ చేశారు తహశీల్దార్ కార్యాలయ సి బ్బంది.

అయితే ప్రస్తుతం మండల కేంద్రం లో 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి కొద్దిరోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి స త్యనారాయణ భూమి పూజ చేశారు. అప్ప టి నుండి అట్టి కాంట్రాక్టర్ తహసీల్దార్ కా ర్యాలయం నుండి ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండానే దాదాపుగా 70 ట్రిప్పుల వరకు ఇసుకను డంప్ చేసాడు. అయితే దీనిపై కాంట్రాక్టర్ 30 వేల రూపాయలు ఫైన్ వేశారని సమాచారం.

ఫైన్ వేసిన వివరాలు తెలపాలని అడిగిన కూడా తహశీల్దార్ నుం డి ఎటువంటి సమాధానం లేదు. సామాన్యులు ఐతే ఒక లెక్క బలిసినోడు అయితే మరో లెక్క అన్నట్టు మండల తహశీల్దార్ ప్ర వర్తిస్తున్నారు. ఎప్పుడైనా అక్రమ ఇసుక డం ప్ ను సీజ్ చేసి వేలం వేసే అధికారులు ప్ర స్తుతం విషయం బయటకు పొక్కకుండా ఫై న్ వేయడం వెనక ఉన్న అంతర్యం ఏంటో మరి.

ముడుపులు ముడితే తప్ప ఇలా చేయరని మండల ప్రజలు గుసగుసలు పెడుతు న్నారు. ఇందిరమ్మ ఇళ్లకు మాత్రం ఇది కా వాలి అది కావాలి అంటూ సతాయిస్తున్న అధికారులు, బడా కాంట్రాక్టర్ పై చర్యలకు ఉపక్రమించడానికి వెనకడుగు వేయడం వెనక ఏదైనా రాజకీయ ఒత్తిడి ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.