calender_icon.png 23 May, 2025 | 5:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాడర్ మనోగతమేంటో?

23-05-2025 12:08:53 AM

అంబీర్ శ్రీకాంత్ :

‘ఓటమి ఉండదు..’ అనుకున్న టీఆర్‌ఎస్ పార్టీకి ఓటర్లు రెండుసార్లు అధికారమిచ్చి సరిపెట్టారు. మూడోసారికి ‘సారీ’చెప్పారు. 2023 చివరన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపించారు. ఇప్పుడు తెలంగాణలో మరోపార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు సమర్థంగా నిర్వహించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎంగా ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఎన్నికల ముందు ఇచ్చినఒక్కో హామీని నేరవర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 

తెలంగాణ సిద్ధించిన తర్వాత ఉద్యమ నేతగా మొట్టమొదటి సీఎంగా కేసీఆర్ రెండు దఫాలు గెలిచి, పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) 2001లో గుప్పెడు మందితో ప్రారంభమైంది. కేసీఆర్ ఒక్కో అవమానాన్ని ఎదుర్కొంటూ, రాజకీయంగా నిలదొక్కుకుంటూ ఒక్కో అడుగు ముందుకువేశారు. పార్టీ క్యాడర్‌ను పెంచుకుంటూ వచ్చారు.

తెలంగాణ సెంటిమెంట్‌తో విద్యార్థులను, యువతను ఆకట్టుకున్నారు. ఆ వెల్లువలో టీఆర్‌ఎస్‌లోకి యువరక్త ప్రవేశించింది. వందలు వేలుగా, వేలు లక్షలుగా పార్టీ క్యాడర్ ‘ఇంతింతై..వటుడింతై..’ అన్నట్లుగా క్యాడర్ పెరిగింది. క్రమంగా బలమైన పార్టీగా ఎదిగింది. మొదటి నుంచి టీఆర్‌ఎస్‌కు కార్య కర్తలే బలం. కేసీఆర్ ఆ బలాన్నే దన్నుగా వినియోగించుకున్నారు.  

‘గులాబీ వనం’లో అయోమయం..

తెలంగాణ సిద్ధించిన తర్వాత  పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు పార్టీలో క్యాడర్ బలం అమాంతం పెరిగింది. ఇక తెలంగాణలో మరే ఇతర పార్టీకి ఇంత క్యాడర్ ఉండబోదు అనేలా క్యాడర్ పెరిగింది. ఎంతోమందికి రాష్ట్రంలో మరో పా ర్టీ అధికారంలోకి రాదు.. అన్న భావన కలిగింది. అలాంటి పార్టీ పదేళ్లు తిరిగే సరికి.. అసలు పార్టీ పేరే మారిపోయింది.

ఏ తె లంగాణ సెంటిమెంట్‌తో పార్టీ పెట్టారో, ఆ సెంటిమెంట్‌ను పట్టించుకోకుండా కేసీఆర్ పార్టీ పేరును మార్చటం విమర్శలకు దారితీసింది. పార్టీకి తిరుగులేదు.. ఎప్పటికీ మ నదే అధికారమని ఆ పార్టీ పెద్దలు భావించిన సందర్భాలూ లేకపోలేదు. ప్రస్తుతం బీఆర్‌ఎస్ అంతర్గత వ్యవహారాలు ఆశాజనకంగా లేవనే టాక్ రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నది.

పార్టీ క్యాడర్‌ను కేసీఆర్ పెద్దగా పట్టించుకోవడం లేదని, పార్టీ రజతోత్సవ సభలోనూ కేసీఆర్ పెద్దగా క్యాడర్ గురించి మాట్లాడలేద నే విమర్శలు ఉన్నా యి. సభలో కార్యకర్తలపై అసహనం వ్య క్తం చేయడంపైనా కొంత క్యాడర్  పెదవి విరుస్తున్నట్లు తెలిసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఎవరికి కట్టబెడతారనే అంశం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశమైంది.

కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు కవిత పోటీ పడుతున్నారనే చర్చ కొంతకాలం సాగింది. కానీ.. కొద్దిరోజుల నుంచి కవిత మరో పార్టీ పెడతారనే చర్చ సైతం మొదలైంది. అందుకు ఊతమిచ్చేలా ఆమె చేసిన వ్యాఖ్యలున్నాయి. అదీకాక.. ఇటీవల కేటీఆర్ పనిగట్టుకుని హరీశ్‌రావుతో భేటీ కావడం కూడా సంచలనం రేపింది.

ఈ పరిణామాల నేపథ్యంలో క్యాడర్  గందరగోళాని కి గురవుతున్నది. పార్టీ రజతోత్సవ సభా ప్రాంగణంలో కేవలం కేసీఆర్, కేటీఆర్ ఫ్లెక్సీలే కనిపించడంపైనా పార్టీ క్యాడర్ లోచర్చ జరిగింది. కవిత, హరీశ్‌రావు ఫ్లెక్సీలకు అక్కడ తావివ్వలేదనే మాటలు కూడా వినిపించాయి.

కాంగి‘రేసు’లో క్యాడర్  డల్..

‘ఓటమి ఉండదు..’ అనుకున్న టీఆర్‌ఎస్ పార్టీకి ఓటర్లు రెండుసార్లు అధికార మిచ్చి సరిపెట్టారు. మూడోసారికి ‘సారీ’చెప్పారు. 2023 చివరన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపించారు. ఇప్పుడు తెలంగాణలో మరోపార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు సమర్థంగా నిర్వహించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎంగా ఆయన బాధ్యతలు తీసుకున్నారు.

ఎన్నికల ముందు ఇచ్చినఒక్కో హామీని నేరవర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆరు గ్యారంటీల అమలు చేసేందుకు కృషి చేశారు. కానీ.. అవి పూర్తిస్థాయిలో అమలు కాలేదు. వాటి అమలుపై ప్రజల్లో అసంతృప్తి ఉందన్నది వాస్తవం. ఇక పార్టీ అంతర్గత వ్యవహారాల విషయానికొస్తే.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు దాటుతున్నది. అయినప్పటికీ.. మంత్రి వర్గ విస్తరణ జరగలేదు.

పార్టీలో పదవుల పంపకాలకు చోటులేకపోయింది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) నుంచి జిల్లా, మండల, గ్రామస్థాయి వరకు వేలాది పదవుల కోసం క్యాడర్ చూస్తున్నది. ఎప్పు డెప్పుడు.. ఎవరెవరెరికి పదవులు వస్తా యా..? అని క్యాడర్ ఎదురుచూస్తున్నది. కానీ.. ఇవాళ రేపో.. ప్రకటన వస్తుందని ఆశవాహులు ఆశించడమే తప్ప పార్టీ నుంచి ఎలాంటి స్పష్టత లేదు. దీంతో క్యాడర్  చిన్నబుచ్చుకుంటున్నారు. మొత్తానికి పార్టీ నివురుగప్పిన నిప్పులానే ఉంది.

‘కమల’ దళ వికాసమేది ?

2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ ఎంతో దూకుడుగా వ్యవహరించిం ది. ఎన్నికల్లో పార్టీ ఆశించిన మేర సీట్లు రాకపోయినప్పటికీ, కొంతమేర సీట్లు వ చ్చాయి. కొన్ని పరిణామాల తర్వాత పార్టీ అధిష్ఠానం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి బండి సంజయ్‌కుమార్‌ను తప్పించింది. అప్పటి నుంచి పార్టీ క్యాడర్ కాస్తం త బలహీనపడిందనే విమర్శలు ఉన్నాయి.

కొన్నిజిల్లాల్లో పార్టీ జిల్లా అధ్యక్షులను ని యమించి, మరికొన్ని జిల్లాల్లో నియమించక పోవడం, ఎంతో కాలంగా నానుతున్న పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఎవరికీ కట్టబెట్టకపోవడంపై పార్టీ క్యాడర్ గుర్రుగా ఉన్నట్లు తెలిసింది.   పార్టీ అధిష్ఠానం పార్టీ తెలంగాణ దళపతిగా ఈటల రాజేందర్‌ను నియమించబోతున్నదని, దాదాపు ఆయ న పేరు ఖరారైందని, ఆయన సైతం ఇదే పనిమీద హస్తినాపురి వెళ్లి వచ్చారనే ప్రచారం జోరుగా సాగింది.

ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ అధిష్ఠానం ఎవరినీ నియమించలేదు. ప్రస్తుతం  కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డినే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సౌమ్యుడిగా, సున్నిత మనస్కుడిగా ఆయనకు పేరున్నది.

కేంద్ర మంత్రి పదవి నిర్వహిస్తూ ఆయన రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు నిర్వహించడం కష్టతరమవుతుందని కొంత క్యాడర్ అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది. ఇలా తెలంగాణలో మూడు ప్రధాన పార్టీల కేడర్లు రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నాయి. పార్టీ అధిష్ఠానాల వైఖరేంటో తెలియక గందరగోళానికి గురవుతున్నాయి.

 వ్యాసకర్త సెల్‌నంబర్ 

81859 68059