15-10-2025 12:00:00 AM
భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 14 (విజయక్రాంతి): ఏం పాలన అందిస్తున్నారు, ప్రజలకు అందుబాటులో ఉండకుండా వ్యవహరించటం ఏమిటంటే కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత పై ఇటీవల కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మూడు నెలలుగా కార్పొరేషన్ గా మార్పు జరిగిన నాటి నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పాల్వంచలో అందుబాటులో ఉండటం లేదని, పరిపాలన పూర్తిగా కుంటు పడిందని, సమాధానం చెప్పేందుకు సైతం అధికారులు అందుబాటులో ఉండటం లేదని పట్టణ ప్రజలు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు.
కార్పొరేషన్ గా మార్పు చెందిన రోజే పాల్వంచ, కొత్తగూడెం ప్రాంతాల్లో రెండు చోట్ల ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఆ రీతిలో ప్రణాళిక రూపొందించి ప్రజలకు తెలియజేయాలని ఆనాడే ఆదేశించిన అమలు చేయకపోవడంపై మండిపడ్డారు. ఏ రోజు ఏ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని హుకుం జారీ చేశారు.