calender_icon.png 15 May, 2025 | 6:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ దందాకు అడ్డుకట్టేదీ..?

15-05-2025 12:00:00 AM

  1. రాత్రి, పగలు వందలాది లారీల్లో చెరువు మట్టి తరలింపు
  2. అడ్డుకున్న గ్రామస్థులు.. విడిపించిన పోలీసులు

మంచిర్యాల, మే 14 (విజయక్రాంతి): జిల్లాలో చెరువు మట్టి అక్రమార్కుల పాలైతున్న సంబంధిత అధికారులు అటువైపు కనీసం కన్నెత్తి చూడటం లేదు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా లారీల ద్వారా వందల సంఖ్యలో మట్టిని తరలిస్తున్నారు. ఇలా ఒక టి, రెండు చెరువులు కాదు పదుల సంఖ్యలో ఈ అక్రమ మట్టి దందా కొనసాగుతుంది.

గ్రామస్తులు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుంటే అధికారులు దగ్గరుండి పంపిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇలా అయితే అక్రమ దందాలకు అడ్డుపడేదెప్పుడని ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. అక్రమాలను అడ్డుకోవాల్సిన అధికారు లు అక్రమార్కులకు అండగా ఉంటున్నారని ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు.

లక్షెట్టిపేట మండలం లక్ష్మీపూర్ ఊర చెరువు నుంచి రాత్రి తొమ్మిది గంటలకు మట్టిని తరలిస్తుండటాన్ని గమనించిన గ్రామస్తులు లారీలను నిలిపి అనుమతి లేకుండా ఎలా మట్టిని తరలిస్తున్నారని ప్రశ్నించి రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్ అధికారులకు సమాచారం అందించారు. అక్రమ మట్టి తరలింపుపై అధికారులను ప్రశ్నించా రు.

వారి నుంచి సమాధానం రాకపోవడం తో గ్రామస్తులు సంబంధిత అధికారులు వచ్చేంత వరకు వాహనాలు కదిలేదని భీష్మించుకుకూర్చున్నారు. అధికారులకు సమాచారం ఇచ్చినా ఎవ్వరూ రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు (లక్షెట్టిపేట ఎస్సై అందుబాటులో లేక పోవడంతో దండేపల్లి ఎస్సై) సంఘటన స్థలానికి చేరుకొని వాహనాలను వదిలిపెట్టాలని, వారికి అనుమతి ఉందని గ్రామస్తులకు తెలుపడంతో అనుమ తి ఉంటే గ్రామస్తులకు చూపించాలని గ్రామస్తులు పట్టుబట్టారు. మీరు సంబంధిత శాఖ నుంచి తీసుకోవాలని చెప్పి వాహనాలను అక్కడనుంచి పంపించారు.

పగలు, రాత్రి మట్టి తరలింపునకు అనుమతి ఉంటుందా..!

ఎక్కడైనా మట్టి, మొరం, ఇసుక తదితరా లు తరలించాలంటే సంబంధిత శాఖ అధికారులు ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు లేదా గంట అటు ఇటు గా అనుమతి ఇస్తుంటారు. కానీ పగలు, రా త్రి చెరువు మట్టి తరలించేందుకు అనుమతి ఇవ్వరు, ఈ విషయం రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్ శాఖలతో పాటు పగలు, రాత్రి బందోబస్తు నిర్వహించే పోలీసుశాఖకు కూడా తెలిసే ఉంటుంది.

కానీ రాత్రి పోలీసులు వచ్చి వాహనానికి సంబంధించి అను మతి పత్రాలు, తదితరాలు ఏమీ పరిశీలించకుండా వదిలి పెట్టడం పలు అనుమానా లకు తావిస్తోంది. ఈ విషయమై ఇరిగేషన్ మండల, డివిజన్ స్థాయి అధికారులను, రెవెన్యూ, మైనిం గ్ అధికారులతో పాటు పోలీసులను సంప్రదించగా ఏ ఒక్క అధికారి సైతం స్పందించ కపోవడం చూస్తే వారికి విధుల పట్ల ఉన్న నిబద్దత ఏ మేరకు ఉందో అర్థమవుతోంది.