calender_icon.png 12 July, 2025 | 6:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనసుకు నచ్చేవే.. హాయి

06-07-2025 12:00:00 AM

కొత్త ఫ్యాషన్లకు ఓటేస్తూనే వాటి నాణ్యత మీదా దృష్టి పెడుతుంటాం. వేసుకునే డ్రెస్సుల్లో రకరకాల ఔట్‌ఫిట్స్ వచ్చినప్పటికీ కొనేటప్పుడు మాత్రం వాటి నాణ్యత, మన్నిక, సౌకర్యాలకే ప్రాధాన్యం ఇస్తాం. ఇదంతా పగటి వేళలో ధరించే వాటి కోసమే, మరి రాత్రి సమయంలో ధరించే వాటి మాటేంటి? అవును స్లీప్‌వేర్ విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలి. సరైనవి ఎంపిక చేసుకుంటే సౌకర్యంతో పాటు మంచి నిద్ర పట్టేలా చేస్తాయి. అంతేకాదు.. శారీరక, మానసిక ఉద్వేగాలనూ నియంత్రిస్తాయి. 

ప్రశాంతంగా నిద్ర పట్టాలని గది వాతావరణం, బెడ్‌షీటు, కర్టెన్లు, దిండ్లు ఇలా ప్రతీది మనకు నచ్చిన వాటినే ఎంచుకుంటాం కదా. కానీ ఎవరు చూస్తారులే.. అని రాత్రివేళ మాత్రం ఏవేవో డ్రెస్సులు వేసుకుంటుంటాం.. ఏడెనిమిది గంటలు మనల్ని అంటిపెట్టుకుని ఉండే నైట్‌వేర్ విషయంలో మాత్రం ఎందుకంత అలక్ష్యం. అలాకాకుండా రాత్రి సమయంలో వేసుకునే బట్టలు కాటన్, లినెన్ మెటీరియల్ అయితే మేలు. అంతేకాదు లేతరంగులనే ఎంపిక చేసుకోవాలి. పింక్, క్రీమ్, తెలుపు రంగు వస్త్రాలు ధరించినప్పుడు ప్రశాంతత లభిస్తుంది. సుతిమెత్తని ఆ దుస్తులు మెదడుకు హాయినిస్తాయి. అందుకే స్లీప్‌వేర్‌నూ ఆచితూచి ఎంచుకోవాలి.