06-06-2025 01:39:29 AM
‘పంచాయతీరాజ్’లో ప్రమోషన్లు పెండింగ్
-వేయికళ్లతో ఎదురుచూస్తున్న ఉద్యోగులు
-సీఎం టేబుల్‌పైకి పదోన్నతులపై జాబితా
-ప్రమోషన్లకు మంత్రి సీతక్క సానుకూలం?
-ఇక సీఎం నిర్ణయమే తరువాయి..
హైదరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): పంచాయతీరాజ్‌శాఖలో ప్రమోషన్లు దీర్ఘకాలం నుంచి పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇవా ళో.. రేపో తమకు ప్రమోషన్లు వస్తాయని ఉద్యోగులు ఎదురుచూస్తుండగా, వారి ఆశ లు అడియాశలవుతున్నాయి.
గత ప్రభుత్వ మూ తమ ప్రమోషన్ల అంశాన్ని పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వమైనా ప్రమోషన్ల అంశాన్ని పట్టించుకుంటుందని భావిస్తే.. అది జరగడం లేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీరాజ్‌శాఖలో క్యాడర్ ప్రకారం ప్రమోషన్లు కల్పించాల్సి ఉన్నప్పటికీ ఉన్నతాధికారులు ఆ మేర కు చొరవ చూపడం లేదనే విమర్శలు న్నాయి. అర్హులైన వారి జాబితా రెండుసార్లు ప్రభుత్వానికి చేరగా, ఇప్పటికీ ప్రమోషన్లు పెండిం గ్‌లో ఉండటం గమనార్హం.
ఒక పోస్టుకు ముగ్గురి పేర్లు..
రాష్ట్ర పరిపాలన వ్యవస్థలో పంచాయతీరాజ్ శాఖ కీలకమైనది. ఈ శాఖ పూర్తిగా గ్రామీణ స్థితగతులకు సంబంధించినది. శాఖలో ఏళ్ల తరబడి ప్రమోషన్లు పెండింగ్‌లో ఉంటుండటంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతుందనే విమర్శలు ఉన్నాయి. ప్రమోషన్లకు అన్ని రకాల అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వం అందుకు సంబంధించిన జీవో విడుదల చేయకపోవడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రమోషన్ల కోసం ఎదురుచూసే వారిలో ఎంతో మంది ఎంపీడీవోలు, డీపీవోలు, డీఆర్డీవోలు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 37 మంది ఎంపీడీవోలు ప్రమోషన్ జాబితాల్లో ఉన్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పోస్టులు సైతం ఖాళీగా ఉన్నట్లు సమాచారం. అందు కు అధికారుల లిస్టు సైతం ప్రభుత్వానికి అందినట్లు తెలుస్తున్నది. ఒక పోస్టు పదోన్నతికి ముగ్గురి పేర్లను సిఫార్సు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
సీఎం ఆమోదం కోసం..
పంచాయతీరాజ్ పరిధిలో ఆరు నెలల క్రితమే ప్రమోషన్లకు అర్హులైన వారి జాబితా సిద్ధమైంది. కారణాలెంటో తెలియదు గానీ.. ఆ శాఖ ఉన్నతాధికారులు సదరు జాబితాను పెండింగ్‌లో పెట్టినట్లు తెలిసింది. తాజాగా మరోసారి జాబితా సిద్ధమైనట్లు ఆ శాఖ వర్గాల విశ్వసనీయ సమాచారం.
దీనిలో భాగంగానే పంచాయతీరాజ్‌శాఖలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, అవుట్ సోర్సిం గ్, కాంట్రాక్టు ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు? రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి ? ఉద్యోగుల్లో ఎవరెవరు ప్రమోషన్లకు అర్హు లు ? అనే అంశాలకు సంబంధించిన వివరాలు ఇప్పటికే ప్రభుత్వా నికి అందినట్లు సమాచారం. అర్హులందరికీ ప్రమోషన్లు వస్తే త్వరలో వారి స్థానంలో మరికొందరికి అవకాశం వస్తుంది. ప్రమోషన్లు ఇచ్చేం దుకు ఆ శాఖ మంత్రి సీతక్క సానుకూలగా ఉన్నట్టు సమాచారం. జాబి తా ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి ఆ మోదం కోసం పంపినట్లు తెలిసిం ది. ఆ ఫైల్‌పై సీఎం ఏవిధంగా స్పం దిస్తారోనని ఉద్యోగులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.