27-09-2025 01:37:39 AM
కొమురవెల్లి రైల్వే స్టేషన్
దసరా ముహూర్తం దాటిపోయినట్లేనా
హనాల రద్దీ తగ్గాలంటే రైలు ఆగాల్సిందే..
కొమురవెల్లి, సెప్టెంబర్ 26: ప్రముఖ పు ణ్యక్షేత్రమైన కొమురవెల్లి ఆలయ భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన రైల్వే స్టేషన్( హాల్ట్) నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. కానీ స్టేషన్ ప్రారంభానికి నోచుకో కపోవడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రైల్వే స్టేషన్ ప్రారంభమైతే అంద రికీ రైలు ప్రయాణం అందుబాటులోకి వ స్తుందని స్థానిక ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
అంతేకాకుండా జంట నగరాల నుంచి వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా మా రనున్నది. కొమురవెల్లి రైల్వేస్టేషన్ నిర్మాణ పనులు పూర్తి చేసి దసరాలోగా రైల్వే స్టేషన్ ను ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 3 నెలల క్రితం సికింద్రాబాద్ లో జరిగిన ఓ సమావేశంలో వెల్లడించారు. మంత్రి ఆదేశాల మేరకు రైల్వే అధికారులు చక చక పనులు చేపట్టి గడువుకు నెలరోజుల ముందే పనులు పూర్తి చేశారు.
పనులైతే పూర్తయ్యా యి కానీ ప్రారంభించడానికి మాత్రం సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొమురవెల్లి మల్లన్న దర్శనానికి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. వీరిలో సామాన్య భక్తులే అధికంగా ఉం టారు. సరైన ప్రయాణ సౌకర్యాలు లేక తిప్పలు పడుతున్నారు. భక్తులు ఆర్టీసీ బస్సు లు, ప్రైవేటు వాహనాల ద్వారా ఆలయానికి చేరుకుంటారు.
ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేవారు ఆలయానికి వచ్చి పోవడానికి గంటలకొద్ది నిరీక్షించాల్సిదే. ఈ రైల్వే స్టేషన్ తో భక్తుల సమస్య తీర్చడం తో పాటు ఈ ప్రాంత ప్రజానీకానికి రైల్ ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే స్థానిక బిజెపి నాయకులు నూతంగా నిర్మించిన రైల్వే స్టేషన్ ను సందర్శించి మంత్రికి పూర్తి సమాచారాన్ని అందజేశారు. మంత్రి కూడా 95శాతం పనులు పూర్తయ్యాయని, తన ట్విట్టర్ ఖాతాలో ఫోటోలను నెల రోజుల క్రితమే పోస్ట్ చేశారు.
సర్వం సిద్ధం....
సకల సౌకర్యాలతో రైల్వే స్టేషన్ ను నిర్మించారు. సువిశాలమైన ప్లాట్ ఫామ్, ప్ర యాణికుల బస చేసే గది, టికెట్ విక్రయ కేంద్రం నిర్మించి సర్వాంగ సుందరంగా తయారు చేశారు. సర్వీస్ రోడ్డు వేసి ఇరువైపులా విద్యుత్ దీపాలు బిగించారు. స్టేషన్ ప్రహరీ గోడకు రంగులు వేసి చూపరలను ఆకర్షించే విధంగా అందమైన పెయింటింగులు వేసి సుందరంగా తీర్చిదిద్దారు.
రద్దీ తగ్గుతుంది...
భక్తులు ఎక్కువగా ప్రైవేటు వాహనాల ద్వారా ఆలయానికి చేరుకుంటారు. జాతర సమయంలో అధిక మొత్తంలో వాహనాలు రావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు వా హనాలతో కిక్కిరిసిపోతుంది. ఒక్కోసారి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుంది. ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి పోలీసులు నానా తంటలు పడతారు. అదే రైలు ప్రయా ణం అందుబాటులోకి వస్తే, రైల్లో ప్రయాణించి, స్థానిక ఆటోల ద్వారా ఆలయానికి చేరడంతో రద్దీ తగ్గి, సులభంగా ఆలయానికి చేరుకోవచ్చు.
ప్రధాన దేవాలయాలకు అనుసంధానం...
మనోహరాబాద్ - కొత్త పల్లి రైల్వే లైన్ కు ఒక ప్రత్యేకత ఉంది. మూడు ప్రధాన దేవాలయాలైన కొమరవెల్లి మల్లన్న, వేములవా డ రాజరాజేశ్వర స్వామి, కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాలను అనుసంధించ డానికే ఈ రైల్వే లైన్ ప్రారంభించారు. కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి వరకు రైల్వే లైన్ పూర్తయితే, అక్కడి నుంచి కొండగట్టు తాకుతూ నిజాంబాద్ కు మరో రైల్వే లైన్ మార్గం ఉంది. ఈ విధంగా మూడు ప్రధాన దేవాలయాలను భక్తులు సందర్శించవచ్చు.
కేంద్ర మంత్రులు దృష్టిసారిస్తేనే...
2016లో కేంద్ర ప్రభుత్వం 155 కిలోమీటర్ల మేరకు ఈ రైల్వే లైన్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు సుమారు 80కిలోమీటర్ల రైల్వే లైన్ పూర్తయింది. ఇంకా సుమారు 75 కిలోమీటర్లు రైల్వే లైన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇటీవలనే సిద్దిపేట స్టేషన్ నుండి చిన్న కోడూరు వరకు ట్రాయల్ రన్ నిర్వహించారు. 2027 డిసెంబర్ లోగా ఈ ప్రాజె క్టును పూర్తి చేయాలి.
కానీ గడువులోగా పూర్తి కావడం అసంభవం. బడ్జెట్ కేటాయింపుల కారణంగానో, అధికారుల నిర్లక్ష్యం మూలంగానో పనులు నత్తనడక నడుస్తున్నాయి. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు దృష్టి సారించి అధిక మొత్తం లో బడ్జెట్ కేటాయింపులు కేటాయించే విధంగా ఒత్తిడి తెచ్చి పనుల మీద దృష్టి సారిస్తే మరో మూడు నాలుగు సంవత్సరాలలో పూర్తి కావచ్చని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ ప్రాజెక్టు గనుక పూర్తయితే భక్తులకు మెరుగైనరవాణా సౌకర్యాలు అందుతాయి.