26-07-2025 12:11:47 AM
హీరో నారా రోహిత్ ఇప్పుడు తన మైల్ స్టోన్ మూవీ ‘సుందరకాండ’తో వస్తున్నారు. ఇది ఆయనకు 20వ సినిమా కాగా, ఇందులో ఆయన బ్యాచిలర్‌గా కనిపించనున్నారు. దీన్ని నూతన దర్శకుడు వెంకటేశ్ నిమ్మలపూడి తెరకెక్కిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్‌రెడ్డి, రాకేశ్ మహంకాళి నిర్మిస్తున్నారు. కథానాయిక శ్రీదేవి విజయ్‌కుమార్‌తో తొలిప్రేమలోని అమాయకత్వాన్ని, మరో నాయిక వ్రితి వాఘానితో సెకండ్ లవ్ ఛాన్స్.. ఇలా జీవితంలోని వివిధ దశల్లో రెండు ప్రేమకథలను నెరపే యువకుడిగా ఆకట్టుకోనున్నారు రోహిత్.
ఇప్పటికే ఈ చిత్ర టీజర్ విడుదలైంది. శుక్రవారం కథానాయకుడు నారా రోహిత్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఆగస్టు 27న గణేశ్ చవితి రోజున ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. తమ సినిమాకు లాంగ్ వీకెండ్ కలిసొస్తుందని భావించిన మేకర్స్ రొటీన్‌కు భిన్నంగా బుధవారం థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. నరేశ్ విజయకృష్ణ, వాసుకి ఆనంద్, సత్య, అజయ్, వీటీవీ గణేశ్, అభినవ్ గోమటం, విశ్వంత్, రూపలక్ష్మి, సునయన, రఘుబాబు వివిధ పాత్రలు పోషించిన ఈ సినిమాకు సంగీతం: లియోన్ జేమ్స్; సాహిత్యం: శ్రీహర్ష ఈమని; డీవోపీ: ప్రదీష్ ఎం వర్మ; ఎడిటర్: రోహన్ చిల్లాలే; ఆర్ట్: రాజేశ్ పెంటకోట.