calender_icon.png 20 May, 2025 | 5:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జగిత్యాల ఎమ్మెల్యేది ఏ పార్టీనో?

20-05-2025 02:25:49 AM

  1. జగిత్యాలలో కలిసి పని చేయడానికి సంజయ్ ఎవరు? 
  2. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి

హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి) : ‘జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీనో నాకు తెలియదు. ఆయన ఏ పార్టీనో స్పీకర్‌ను అడిగితే  తెలుస్తుంది. జగిత్యాలలో కలి సి పనిచేయడానికి సంజయ్ ఎవరు..? నేను చాలా సీనియర్ నాయకుడిని.. నాకు జగిత్యాల అభివృద్ధిపై అవగాహన ఉంది’ అని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవా రం ఆయన గాంధీభవన్‌లో మీడియా తో మాట్లాడుతూ.. జగిత్యాల అభివృద్ధి కి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నిధులు ఇస్తానని చెప్పారని తెలిపారు. కేం ద్రం జనగణనలో కులగణన చేస్తామనడం హర్షణీయమన్నారు. బలహీనవర్గాలకు సా మాజికన్యాయం కల్పించడంలో కాంగ్రెస్ ముందున్నదని, రాహుల్‌గాంధీ ఆలోచనతో రాష్ట్రంలో కులగణన జరిగిందన్నారు.