08-11-2025 12:00:00 AM
-జిల్లాలో గాడి తప్పుతున్న ప్రభుత్వ యంత్రాంగం
-క్షేత్రస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అవినీతి ఆరోపణలు
కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 7(విజయక్రాంతి): ప్రభుత్వ యంత్రాంగం ప్రజా సంక్షేమం ,అభివృద్ధి కోసం పని చేయాల్సింది పోయి అక్రమాలకు తెరలేపడం తో జిల్లావ్యాప్తంగా అవినీతి రాజ్యం సాగుతుందని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. దీనికి తోడు ఇటీవల జిల్లా స్థాయి అధికారులు ఇద్ద రు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరకడం ఆరోపణలకు ఆజ్యం పోసినట్లు అయిం ది.
జిల్లా సహకార ఇన్చార్జ్ అధికారిగా ఉన్న బిక్కు నాయక్ బెజ్జూర్ సహకార సంఘం లో నీ ఉద్యోగం నుండి డబ్బులు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన సంఘటన మర్చిపోకముందే మరో జిల్లాస్థాయి అధికారి రైస్ మిల్ యజమాని నుండి డబ్బులు తీసుకుం టూ ఏసీబీకి చిక్కారు.ప్రతి శాఖలో అవినీతి రాజ్యమేలుతుందని బహిరంగంగా చర్చ జరుగుతున్న సమయంలో జిల్లా స్థాయి అధికారు లు ఇద్దరు ఏసీబీకి పట్టు పడడం గమర్హనం.
క్షేత్రస్థాయి అధికారుల నుండి జిల్లా స్థాయి అధికారులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.ముఖ్యంగా రెవెన్యూ శాఖలో అవినీ తి ఆరోపణలు ఎక్కువ స్థాయిలో వస్తున్నాయి. జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున అవినీతి, అక్రమా లు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ ప్రభుత్వ నిఘా వర్గాలు ఏం చేస్తున్నా యని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.జిల్లాలోని ప్రభు త్వ అధికారులు అవినీతికి పాల్పడుతున్నప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదని విమర్శలు లేకపోలేదు.
కొన్ని సందర్భాల లో జిల్లాస్థాయి అధికారులే కాకుండా ఉన్నత స్థాయి అధికారులు సైతం అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. జిల్లాలో ఏ చిన్న పని కావాలన్నా డబ్బు పెట్టనిదే అవడం లేదని బహిరంగంగా చర్చ జరు గుతుంది. ఓ ఉన్నతాధికారే అవినీతికి పాల్పడుతున్నారని వారికి కొంతమంది రాజకీయ నాయకులు వత్తాసు పలుకుతున్నట్లు తలంపులు వస్తున్నాయి. అధికారులకు మధ్యవర్తి త్వంగా రాజకీయ నాయకుల వద్ద పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పమంటున్నాయి.ప్రభుత్వ అభివృద్ధి పనులు చేసిన బిల్లుల కోసం పర్సంటేజీలు క్షేత్రస్థాయి నుండి ఉన్నతాధికారి వరకు అందుతున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.
పట్టించుకోకుంటే ప్రజలకు కష్టమే.....
జిల్లాలో పెట్రేగిపోతున్న అవినీతి, అక్రమాలపై నిఘా వర్గాలు పట్టించుకోకపోతే భవిష్యత్తులో ప్రజలు మరింత కష్టాలపాలు కావాల్సిందేనని చర్చ జరుగుతుంది.మధ్యతరగతి ప్రజల పనులు ముందుకు సాగడం లేదని వాదనలు వినిపిస్తున్నాయి.జిల్లా స్థాయి అధికారులే అవినీతికి పాల్పడితే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికా రులు, సిబ్బంది నిజాయితీగా పనిచేసినప్పటికీ ఉపయోగం లేదని వాదనలు ఉద్యోగ వర్గాల్లో లేకపోలేదు.ఇప్పటికైనా అధికారుల తీరు మార్చుకొని ప్రజల కోసం పనిచేయాలని కోరుతున్నారు.ఉన్నత అధికారులు దృష్టి సారించి జిల్లా పై పడ్డ అవినీతి మచ్చను తొలగించేందుకు నిబద్దతతో పనిచేసి పరిపాలన విభాగాన్ని గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అవినీతి, అక్రమాలను నిర్మూలించాలి
జిల్లాలో జరుగుతున్న అవినీతి అక్రమాలను నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ప్రభుత్వ శాఖలలో నెలకొన్న అవినీతిపై నిఘా వర్గాలు దృష్టిసారించాలి.అవినీతి పెరగడంతో సామాన్య ప్రజల పరిస్థితి దారుణం గా మారింది. జిల్లా వ్యాప్తంగా ఆయా శాఖలపై వస్తున్న అవినీతి, అక్రమాలపై ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించి నిజాలను నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది.జిల్లాలో జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని తనిఖీలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాను.
దుర్గం దినకర్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి.