calender_icon.png 29 October, 2025 | 2:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్యానల్‌లో ఎవరికి వారే..

29-10-2025 12:57:35 AM

ఆర్భన్ బ్యాంక్ ఎన్నికల్లో వింత పోకడ

కరీంనగర్, అక్టోబర్28(విజయక్రాంతి): కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో మూడు ప్యానలు నువ్వబనేనా అన్నట్టు పోటీ పడుయున్నారు. ప్యానల్ అ భ్యర్ధులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్యానల్ లోని కొందరు వ్యక్తిగతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ పతిస్థితిల్లో ఓకే ప్యానల్ స్వీప్ చేస్తోంది అన్నది అనుమానమే.మూడు ప్యానళ్ల అభ్యర్థులు కాం గ్రెస్ పార్టీకి సంబంధం ఉన్నవారే కావడంతో, ఒక ప్యా నల్ కు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్రావు మద్దతిస్తుండడం విమర్శలకు దారితీసింది.

రాజేందర్ రావు ఏర్పాటు చేసిన ప్యానల్ లో చైర్మన్ అభ్యర్దిని ప్రకటించకుండా ప్రచారం చేస్తున్నారు. అయితే చైర్మన్ కోసం ఈ ప్యానల్ లో ముగ్గురు ఆశలు పెంచుకొని ఎవరికి వారుగా చైర్మన్ నేనే అంటూ చెప్పుకుంటుండటం తో ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు . కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు 12 డైరెక్టర్ స్థానాలకు 56 మంది పోటీ పడుతున్నారు. 43 మంది 9 జనరల్ స్థానాలకు, ఐదుగురు రెండు మహిళా స్థానాలకు, ఒక ఎస్సీ, ఎస్టీ స్థానానికి 8 మంది పోటీ పడుతున్నారు. మాజీ చైర్మన్ కర్ర రాజశేఖర్ ప్యానల్, మరో మాజీ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి ప్యానల్ ఏర్పాటు చేసుకుని ప్రచారం ప్రారంభించారు.

కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జి వెలిచాల రాజేందర్రావు కాంగ్రెస్ నాయకులతో ఏర్పాటు చేసిన ప్యానల్ ఎన్నికల తర్వాత మెజార్టీ సభ్యుల అభిప్రాయం మేరకు చైర్మన్ అభ్యర్థిని ప్రకటించేందుకు నిర్ణయించడం వెనుక వెలిచాల వ్యూహం ఏమయి ఉంటుంది అన్నది మిగితా ప్యానల్ వారికి అంతుపట్టడం లేదు. ఏ ప్యానల్బకుమెజారిటీ రాకుంటే గెలిచిన అభ్యర్థుల కొనుగోలు , క్యాంపు రాజకీయాలుతప్పవు.