calender_icon.png 17 August, 2025 | 7:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎవరీ శేషన్?

17-08-2025 12:03:51 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 16: తిరునెల్లు నారాయణ అయ్యర్ శేషన్.. టీఎన్ శేషన్.. ప్రస్తుత తరానికి పెద్దగా పరిచయం లేని పేరు. కానీ 90ల్లో దేశ రాజకీయాలను ఈ పేరు ఒక ఊపు ఊపింది. రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను నిక్కచ్చిగా ఉపయోగించి రాజకీయ పార్టీలు, నాయకులను గడగడలాడించారు. నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తే చా లు.. అనేక సంస్కరణలు తీసుకురావొచ్చని నిరూపించారు. మన రాజ్యాంగం దేశ ఎన్నికల కమిషన్‌పై గురుతర బాధ్యత పెట్టింది.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని కాపాడే క్రమంలో బాధ్యతలను నిర్వర్తించడానికి ఎన్నో అధికారాలనూ ఇచ్చింది. కానీ 1990 దాకా ఈ బాధ్యత చేపట్టిన వారిలో చాలామంది అధికార పార్టీకి అనుగుణంగా నడుచుకున్నవారే ఎక్కువగా ఉన్నారు. కానీ టీఎన్ శేషన్ రాకతో కేంద్ర ఎన్నికల సంఘం స్వరూపమే మారిపోయింది. కేరళలోని పాలక్కడ్ జిల్లాలో 1932 డిసెంబరు 15న జన్మిం చిన శేషన్ మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చదివి అక్కడే పాఠాలు చెప్పారు. పోలీసు సర్వీస్‌కు ఎంపికైనప్పటికీ 1954లో సివిల్స్‌లో విజయం సాధించి తమిళనాడు కేడర్ ఐఏఎస్ అధికారి అయ్యారు.

తమిళనాడు నుంచి కేంద్ర సర్వీసుల్లోకి వచ్చిన శేషన్.. అనేక శాఖల్లో కీలక పాత్ర పోషించారు. 1985- మధ్య అడవులు, పర్యావరణ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా తెహ్రీ, సర్దార్ సరోవర్ ప్రాజెక్టులను వ్యతిరేంచారు. 1989లో సివిల్ సర్వెంట్లకు అత్యున్నత పదవిగా భావించే భారత కేబినెట్ కార్యదర్శిగా యమితులయ్యారు. ప్రణాళిక సంఘం సభ్యుడిగానూ కొనసాగారు. అనంతరం 1990 డిసెంబర్ 12న టిఎన్ శేషన్‌ను కేంద్రం ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా (సీఈసీ)గా నియమించింది. శేషన్ ఎంపికలో అప్పటి న్యాయశాఖ మంత్రి సుబ్రమణ్య స్వామి కీలకపాత్ర పోషించారు. 1996 డిసెంబరు 11న తన పదవీకాలం ముగిసే దాకా శేషన్ మన రాజ్యాంగానికున్న బలమేంటో చూపించారు.