27-09-2024 12:00:00 AM
నగరంలో చెరువులు, పార్కులను, నాలాలను కాపాడాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ప్రవేశపెట్టింది. దానికి ప్రత్యేక అధికారాలను కూడా ఇచ్చింది. ఇప్పటికే హైడ్రా ఎన్నో ఆక్రమణలు కూల్చేసి దూసుకుపోతుంది. ఐతే, కొన్ని ప్రాంతాల్లో పేద ప్రజలు అనేక ఏళ్లుగా నివాసం ఉన్నారు. అలాగే, ఇటీవల కాలంలో భూములు, విల్లాలు, ఇండ్లు కొన్నవారు ఉంటారు. వారికి అవి కొనేటప్పుడు బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ అనే విషయాలు తెల్సి ఉండవు. కొందరు బడా బిల్డర్లు అక్రమంగా అధికారుల అండదండలతో చెరువులను ఆక్రమించి, భారీ అపార్ట్‌మెంట్స్, విల్లాలు నిర్మించారు. దానికి ఇప్పుడు అమాయక ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. నిజానికి ఇది ఎవరి పాపం? జనానికి మాత్రం శాపంగా తయారయింది. కనుక, ప్రభుత్వం ఆ బిల్డర్స్ నుంచి నష్టపోయిన వారికి డబ్బులను వెనక్కి ఇప్పించాలి. పేదలకు తగిన చోట ఇల్లు కట్టివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
- శ్రిష్టి శేషగిరి, సికింద్రాబాద్