27-09-2024 12:00:00 AM
ఇటీవల కురిన భరీ వర్షాలకు తెలంగాణలోని పలు జిల్లాల్లో పంటు దారుణంగా దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. వారిని ఆదుకోవడం కోసం రాష్ట్రప్రభుత్వం పరిహారాన్ని సైతం ప్రకటించింది. అయితే చాలా చోట్ల బాధితులు తమకు పరిహారం అందలేదని వాపోతున్నారు. అధికారులు నష్టాన్ని అంచనా వేయడంతో చేసిన పొరబాట్లకు తాము బలవుతున్నామని వరు వాపోతున్నారు. ఇలా నష్టపరిహారం అందని రైతుంతా పొలాల్లో సెల్ఫీలు సైతం దిగి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు కూడా. అయినా ప్రభుత్వంనుంచి ఇప్పటివరకు దీనిపై అధికారికంగా ఎలాంటి స్పందనా లేదు.
ఆరుగాలం శ్రమించి, అప్పులు చేసి పెట్టుబడి పెట్టి వేసిన పంటలు తమ కళ్ల ముందే ఎందకూ పనికి రాకుండా పోవడం చూసి రైతులు ఆవేదనతో తల్లడిల్లి పోతున్నారు. ప్రతిపక్షాలకు ఇదో ఆయుధంగా మారుతోంది. తమది ప్రజాప్రభుత్వం అని ఘనంగా చెప్పుకునే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికయినా జరిగిన తప్పును సరిదిద్ది బాధితులందరికీ పరిహారం లభింఏలా చూడాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో వరదల సమయంలో ఎంతో శ్రమకోర్చి బాధితులను ఆదుకున్న సర్కార్ ఈ కారణంగా బద్నాం అవుతుంది.
బలరాం నాయక్, మహబూబాబాద్.