06-08-2025 12:38:40 AM
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్, ఆగస్ట్ 5 (విజయ క్రాంతి): నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ చేపట్టిన జానహిత పాదయాత్రలో జనాలు కరువై జనరహిత పాదయాత్రగా మారిందని నిజామాబాద్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ ఏద్దేవా చేశారు. గ్రామాలలో కాంగ్రెస్ ను ఎవరు నమ్మే పరిస్థితి లేక యాత్రకు డబ్బులు ఇచ్చి జనసమీకరణ చేసారని ఆయన ఆరోపించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రాజకీయ డ్రామాతో ఒకదానికొకటి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి అన్నారు.
మోటార్లు వెయ్యి కోట్లకు వచ్చేవి రెండు వేల కోట్లు పెట్టి ఎలా కొనుగోలు చేసారన్నారు. కాళేశ్వరం అవినీతిపై బీఆర్‌ఎస్ నాయకులను ఎందుకు జైలుకు పంపడం లేదని అన్నారు. ప్రజలకు నిజాలు కావాలని కమీషన్ల డ్రామాలు వద్దని దమ్ముంటే కాళేశ్వరం కేసును సీబీఐ కి అప్పగించాలని డిమాండ్ చేసారు.
భారతీయ జనతా పార్టీ నాంపల్లి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహిం చిన పత్రిక సమావేశంలో నిజామాబాదు అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతు తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయాలనే ఆలోచనతో కాంగ్రెస్ యాత్ర చేపట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రేమ్ సాగర్ రాథోడ్ మాజీ ఎమ్మెల్యే, శ్రీకాంత్ కార్పొరేటర్, నిజామాబాదు బిజెపి నాయకులు లక్ష్మినారాయణ, ప్రభాకర్, పవన్, ఆనంద్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.