23-07-2024 03:55:00 AM
హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును ఇతర రాష్ట్రానికి ఎందుకు మార్చాలంటూ ప్రశ్నించింది. ఈ కేసును మధ్యప్రదేశ్‌కు బది లీ చేయాలని బీఆర్‌ఎస్ నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టి స్ బీఆర్ గవాయి, కేవీ విశ్వనాథ్‌తో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం విచారించింది. నిందితుడు సీఎం అయినంత మాత్రనా కో ర్టులు ప్రభావితం అవుతాయా? అంటూ పిటిషనర్లపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.
ఒకవేళ దేశంలో అత్యున్నత స్థానాల్లోని వ్యక్తులపై కేసులు నమోదైతే వాటిని శ్రీ లంక లేదా పాకిస్థాన్‌కు మార్చాలా? అం టూ ప్రశ్నించింది. నిందితుడు సీఎం అయితే సాక్షాలు తారుమారు చేసే అవకాశం ఉంద ని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించడంపై ధర్మానసం పైవిధంగా స్పం దించింది. ఈ కేసుపై రెండు వారాల్లో రీజాయిండర్ దాఖలు చేయాలని పిటిషనర్లను అత్యున్నత ధర్మానసం ఆదేశించింది. మాజీ హోంమంత్రి మహ్మద్ అలీ, మాజీ మం త్రులు జగదీశ్వర్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఈ ఏడాది జనవరి 31న పిటిషన్ దాఖలు చేశారు.