24-05-2025 01:14:12 AM
తప్పు చేయకుంటే నోటీసులపై భయమెందుకు?
హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇచ్చిన నోటీసులకు కేసీఆర్, హరీశ్‌రావు ఉలిక్కిపడుతున్నారని, నోటీసులు అందగానే బీఆర్‌ఎస్ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించా రు. తాము విచారణకే ఆదేశించామని, ఇంకా చర్యలు తీసుకోలేదని ఎద్దేవా చేశారు.
అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేయాల్సిన తప్పులన్నీ చేశారని, ఇప్పుడు నోటీ సులు ఇచ్చినందుకు భయపడుతున్నారని విమర్శించారు. అనుమానాలు ఉం టే కమిష న్‌కు ఎందుకు ఆధారాలు ఇవ్వలేదని ప్రశ్నించారు. మీరు చేసిన ఎఫ్‌ఐ ఆర్‌నే కొనసాగిద్దామని.. నిజాయతీ నిరూపించుకోండని ఉత్తమ్ సవాల్ చేశారు. లేకపోతే తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తప్పు చేయకపోతే భయపడకుండా కమిషన్ ముందు హాజరు కావాలన్నారు. శుక్రవారం సాయంత్రం సెక్రటేరియట్ మీడి యా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూ.84 వేల కోట్లతో మొదలై కాగ్ నివేదిక ప్రకారం రూ.లక్షా 20వేల కోట్లకు చేరిందన్నారు. తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేవని గత పాలకులు తప్పుడు ప్రచారం చేశారని ఆరో పించారు.
కమీషన్లకు కక్కుర్తిపడి తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజిని తరలించారని, బీఆర్‌ఎస్ నాయకుల జేబులు నింపుకోవడానికే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు. జ్యూడిషియల్ కమిషన్‌ను తప్పుపట్టడం కరెక్ట్ సిరికాదన్నారు. మేడిగడ్డపై బీఆర్‌ఎస్ హయాంలోనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని, అక్కడ బాంబులు ఉన్నాయో లేదో ఎందుకు తేల్చలేదని ప్రశ్నించారు.
మేడిగడ్డలో బాంబులు అని తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు చట్టప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్డీఎస్‌ఏపై విమర్శలు చేసినందుకు సైతం చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని తెలిపారు. బీఆర్‌ఎస్ పాలనలోనే కాళేశ్వరం ప్రాజెక్టు వైట్ ఎలిఫెంట్ అని కాగ్ నివేదిక వెల్లడించిందన్నారు. రూ.38 వేల కోట్లతో పూర్తయ్యే తుమ్మిడిహట్టిని వదిలేసి రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం కట్టిన చరిత్ర బీఆర్‌ఎస్ నాయకుల దన్నారు.
కాళేశ్వరానికి పెట్టిన ఖర్చుతో ఎస్‌ఎల్బీసీ, సీతారాం సాగర్, డిండి ప్రాజెక్టులు పూర్తి అయ్యేవన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరణ చేయాలని ప్రయత్నం చేస్తున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఫౌండేషన్‌లో తప్పులు చేసినట్లు నిపుణులు చెపుతున్నారని వెల్లడించారు. జ్యుడిషియల్ విచారణ సంస్థ స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేస్తుందన్నారు. దీంతో ప్రభుత్వానికి సంబంధం ఉండదన్నారు. బాంబులపై అనుమానం ఉంటే కమిషన్ ముందు హాజరై ఆధారాలు ఇవ్వాలని సూచించారు.