calender_icon.png 21 January, 2026 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి

29-10-2024 01:36:06 AM

భర్తకు తీవ్ర గాయాలు 

ఖమ్మం, అక్టోబర్ 28 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో భార్య మృతిచెందగా, భర్త తీవ్రగాయాలపాలైన ఘటన ఖమ్మం రూరల్ మండ లం తల్లంపాడులో చోటుచేసుకున్న ది. పోలీసులు తెలిపిన వివరాల ప్ర కారం.. నేలకొండపల్లి మండలం చెన్నారానికి చెందిన  ఆవుల లక్ష్మీనారాయణ, తన భార్య పద్మతో కలిసి సోమవారం తోడేళ్లగూడెంలో జరిగిన శుభాకార్యానికి హాజరయ్యాడు.

అనంతరం ద్విచక్రవాహనంపై తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా, మార్గమధ్యంలోని తల్లంపాడు వద్ద వాహనా న్ని లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో భార్య పద్మ అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్ర గాయాల పాలైన లక్ష్మీనారాయణను స్థానికులు 108 లో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఖమ్మం రూరల్ పోలీసు లు కేసు దర్యాప్తు చేస్తున్నారు.