12-04-2025 12:00:00 AM
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, ఏప్రిల్ 11: విద్యాహ క్కు చట్టం (ఆర్‌టీఈ) అమలుపై దాఖలైన పిల్‌పై తెలంగాణ హైకోర్టు శుక్రవా రం విచారణ చేపట్టింది. రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఆర్‌టీఈ యాక్ట్‌ను అమలు చేయాలని సామాజిక కార్యకర్త తాండవ యోగేశ్ పిటిషన్ వేశారు. దీని అమలుకు సంబంధించిన పురోగతిపై అఫిడవిట్ దాఖలు చేయాలని పభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. విచా రణను ఈ నెల 21కి వాయిదా వేసింది.