25-01-2025 12:00:00 AM
నేడు భారత్, ఇంగ్లండ్ రెండో టీ20
చెన్నై: స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా టీమిండియా నేడు చెన్నై వేదికగా రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను భారీ తేడాతో చిత్తు చేసిన భారత్ రెండో మ్యాచ్‌లోనూ అదే జోరును ప్రదర్శించాలని ఉవ్విళ్లూరుతోంది. తొలి టీ20కి తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన షమీ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
శుక్రవారం ప్రాక్టీస్ సెషన్‌లో షమీ చాలాసేపు బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. మరి రవి బిష్ణోయి స్థానంలో షమీ తుది జట్టులోకి వస్తాడా అన్నది చూడాలి. బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ, శాంసన్, తిలక్ వర్మ, రింకూ సింగ్ సూపర్ ఫామ్‌లో ఉండగా.. కెప్టెన్ సూర్య రాణించాల్సి ఉంది.
ఆల్‌రౌండర్లుగా హార్దిక్, అక్షర్, నితీశ్‌లు ఉండగా.. అర్ష్‌దీప్, వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యాలతో బౌలింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. మరోవైపు తొలి టీ20లో బ్యాటింగ్‌లో విఫలమైన ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని ఆశిస్తోంది. చెన్నై పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండడంతో షమీ ఈ మ్యాచ్‌లో ఆడడం కష్టమే అనిపిస్తోంది.