calender_icon.png 27 July, 2025 | 2:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఇప్పటికైనా’ అక్రమాలు ఆగేనా..!

25-07-2025 02:27:54 AM

  1. పెద్ద అంబర్‌పేట్ మున్సిపల్ జోరుగా అక్రమ కట్టడాలు 

ఇంటి నిర్మాణాలు లేకుండా ఇంటి నెంబర్లు జారీ..

రెసిడెన్షియల్ పర్మిషన్లతో కమర్షియల్ కట్టడాలు

అక్రమాల భాగోతాలపై విజిలెన్స్‌కు ఫిర్యాదులు

రంగంలోకి జిల్లా విజిలెన్స్ అధికారులు

మున్సిపల్‌లో అక్రమ నిర్మాణాలు, కబ్జాలపై విజయక్రాంతిలో వరుస కథనాలు

అబ్దుల్లాపూర్‌మెట్, జూలై 24:పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతు న్న అక్రమ నిర్మాణాలపై జిల్లా విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. మున్సిపల్ లో ఏ నిర్మాణం కొనసాగాలన్న.... ఏ ఫైలు కదలాలన్నా చేతులు తడబాల్సిందని ఆరోపణ లు గొప్పమంటున్నాయి. దీంతో మున్సిపాలిటీ ప్రజలు విసుగు చెంది ఇటీవలనే పలు వురు బాధితులు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు చేశారు.

స్పందించిన జిల్లా విజిలెన్స్ అధికారులు గురువారం మున్సిపాలి టీలో ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. కార్యాలయంలోని అన్నీ పైల్స్ చెక్ చేశారు. ఇంటి నిర్మాణం లేకుండా ఇచ్చిన హౌజ్ నెంబర్లతో పాటు, ఓసీ రిలీజ్‌లు, బిల్డింగ్ ప ర్మిషన్లు, అక్రమ నిర్మాణాలు, అక్రమ షెడ్లు, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్‌లో కొనసాగుతున్న అవినీతి ఇలా అన్ని విభాగాల్లో తనిఖీలు ని ర్వహించారు.

దీంతో మున్సిపల్ అధికారు లు కొంత గుబులు పుట్టింది. గత కొంత కా లం గా పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీల పరిధిలోని ప్రభుత్వ భూములు, పార్కులు, అక్రమ నిర్మాణాలు, చెరువు ఎఫ్‌టీఎల్ ఆక్రమణలపై విజయ క్రాంతి వరుస కథనాలు ఇచ్చింది.

అన్నీ అక్రమాలే..!

పెద్ద అంబర్‌పేట్ మున్సిపల్ ఆఫీసులో అన్నీ అక్రమ దందాలే కొనసాగుతున్నా య ని మున్సిపల్ ప్రజలు పలుసార్లు ఆరోపణ లు గుప్పించారు. మున్సిపల్ అధికారులు అ క్రమార్కులు ఇచ్చే తాయీలలకు అలవాటు పడి.. ఇక్కడ జరుగుతున్న అక్రమాలపై స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చినా అవన్నీ బు ట్టదాకాలే అని... వారంతా అక్రమార్కు లకే వంత పాడుతున్నారనే విమర్శలు సైతం మూటగట్టుకుంటున్నారు.

ప్రభుత్వ భూములు, పార్కు స్థలాలే..!

మున్సిపాలిటీలో పరిధిలో ప్రభుత్వ భూ ములు, పార్కు స్థలాలను అక్రమార్కులు కబ్జాకు పాల్పడుతున్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి.పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని పసుమాముల కళానగర్‌లోని జెడ్పీ రోడ్డుకు అనుకుని పసుమాముల గ్రామ సర్వే నెంబర్ 386లో ప్ర భుత్వ భూమి ఉంది. అక్కడ గతంలో గుడి నిర్మాణ పనులు చేపట్టారు. గుడి నిర్మిస్తున్న స్థలంపై అక్రమార్కుల కన్ను పడింది. దీంతో స్థానిక నాయకులు, అధికారులతో అక్రమార్కులు చేతులు కలిపి ఆ గుడిని కూల్చివేశా రని ఆరోపణలు సైతం ఉన్నాయి. 

అలాగే హ తిగూడ సర్వే నెంబర్ 2, 3, 4లలో పార్కు స్థలం దాదాపు 500 గజాలు స్థలం ఇందు లో కొంత మేర అక్రమార్కులు కబ్జాకు పా ల్పడ్డారు. ఇలాంటి వాటిపై స్థానికుల నుంచి విజిలెన్స్ అధికారులకు ఫిర్యా దులు అందడంతో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీ లు చేస్తున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.

తీరు మార్చుకోవాలే..

మున్సిపాలిటీలో జరుగుతున్నా అక్రమాలపై గతంలో ఎన్నో సార్లు ఫిర్యాదులు చేశాను. నామమాత్రపు చర్యలు చేపట్టి.. చేతులు దూలుపుకుం డ్రు. అలాగే స్థానికులు కొందరు అధికారులకు ఫిర్యాదులు చేయడంతో మున్సిపల్ ఆఫీసులో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేసిండ్రు. ఇప్ప టికైనా మున్సిపల్ అధికారులు తీరు మార్చుకుని అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుని.. పార్కులు, ప్రభు త్వ భూములను కాపాడాలె.

 యంజాల ప్రహ్లాద్, పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ